Tokyo Olympics: ప్రముఖ భారతీయ ఆర్చర్ తరుణ్‌దీప్‌ రాయ్ గురించి మీకు తెలియని 10 విషయాలు..!

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అనుభవజ్ఞుడైన భారతీయ ఆర్చర్ తరుణ్‌దీప్‌ రాయ్. చివరి ఒలింపిక్స్ ఆడుతున్న ఈ ఆర్చర్ గురించి తెలుసుకోవాల్సిన 10 విషయాలను ఇప్పుడు చూద్దాం.

Tokyo Olympics: ప్రముఖ భారతీయ ఆర్చర్ తరుణ్‌దీప్‌ రాయ్ గురించి మీకు తెలియని 10 విషయాలు..!
Indian Archer Tarundeep Rai
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 05, 2021 | 5:51 PM

Tokyo Olympics: గత 18 సంవత్సరాల నుంచి భారత ఆర్చరీ జట్టులో తరుణ్‌దీప్‌ రాయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సిక్కింలో జన్మించిన ఈ ఆర్చర్.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. నెదర్లాండ్స్‌లోని హెర్టోజెన్‌బోష్‌ లో 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తరుణ్‌దీప్‌ రాయ్, అట్ను దాస్, ప్రవీణ్ జాదవ్ లు ఈ ఈవెంట్‌లో రజత పతకాన్ని సాధించారు. ఈ ముగ్గురు ఆర్చర్స్ సింగిల్‌గా, అలాగే టీంగా టోక్యో ఒలింపిక్స్ కి అర్హత సాధించారు. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నాడు. అయితే తరుణ్‌దీప్‌ రాయ్‌ రి  ఇవే చివరి ఒలింపిక్స్. టోక్యో ఒలింపిక్స్ తరువాత అతను రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. అందుకే ఈ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సందర్భంగా ఆర్చర్ తరుణ్‌దీప్‌ రాయ్ గురించి 10 విషయాలను తెలుసుకుందాం.

తరుణ్‌దీప్‌ రాయ్ ది ఏ రాష్ట్రం? తరుణ్‌దీప్‌ రాయ్ సిక్కిం లోని నామ్చి జిల్లాకు చెందినవాడు.

భైచుంగ్ భూటియాకు తరుణ్‌దీప్‌ రాయ్కు గల సంబంధం? తరుణ్‌దీప్‌ రాయ్ భారత మాజీ కెప్టెన్, లెజెండ్ భైచాంగ్ భూటియాకు దగ్గరి బంధువు.

తరుణ్‌దీప్‌ రాయ్ ఆటకు స్వస్తి చెప్పనున్నాడా? అవును. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ 2021 తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8, 2021 వరకు జరగనున్నాయి. తన చివరి పోటీల్లో సత్తా చాటేందుకు తరుణ్‌దీప్‌ రాయ్ సిద్ధమయ్యాడు.

తరుణ్‌దీప్‌ రాయ్ ఎప్పుడు అరంగేట్రం చేశారు? 2003వ సంవత్సరంలో మయన్మార్‌లోని యాంగోన్‌లో జరిగిన ఆసియా ఆర్చర్ ఛాంపియన్‌షిప్‌లో తరుణ్‌దీప్‌ రాయ్ తొలిసారిగా బరిలోకి దిగాడు.

తరుణ్‌దీప్‌ రాయ్ అద్భుత ప్రదర్శన? 2004వ సంవత్సరంలో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం సాధించాడు. అప్పటి నుంచే తరుణ్‌దీప్‌ రాయ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

తరుణ్‌దీప్‌ రాయ్ ఒలింపిక్స్‌లో ఇంతకు ముందు ఆడాడా? అవును. తరుణ్‌దీప్‌ రాయ్ 2004, 2012 లో రెండు ఒలింపిక్స్‌లో భాగమయ్యాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్ క్రీడలలో తరుణదీప్ రాయ్ వ్యక్తిగత పురుషుల ర్యాంకింగ్ రౌండ్లో 32 వ స్థానంలో నిలిచాడు. కానీ, 64 వ రౌండ్లో ఓటమిపాలయ్యాడు. కాగా, లండన్ ఒలింపిక్స్‌ లో అతను 31 వ స్థానంలో నిలిచాడు. ర్యాంకింగ్ రౌండ్‌, 32 వ రౌండ్‌లో ఓడిపోగా, భారత జట్టు మాత్రం 12 వ స్థానంలో నిలిచాడు.

ఆసియా క్రీడల్లో తరుణ్‌దీప్‌ రాయ్ రికార్డులు? తరుణ్‌దీప్‌ రాయ్ కొన్నేళ్లుగా ఆసియా క్రీడల్లో బాగా రాణిస్తున్నాడు. 2006 లో నిర్వహించిన దోహా ఆసియా క్రీడలలో టీం ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. 2010 ఆసియా క్రీడలలో అతను వ్యక్తిగత ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

టోక్యో ఒలింపిక్స్‌కు తరుణ్‌దీప్‌ రాయ్ ఎక్కడ సిద్ధమవుతున్నాడు? పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నాడు. ఒలింపిక్ పతకం సాధించేందుకు తరుణ్‌దీప్‌ రాయ్‌కి ఇదే చివరి అవకాశం.

తరుణ్‌దీప్‌ రాయ్ భారతీయ ఆర్చర్లలో అత్యంత ఫేమస్ ఎలా అయ్యాడు? తరుణ్‌దీప్‌ రాయ్ గత రెండు దశాబ్దాలుగా జాతీయ, అంతర్జాతీయంగా నిలకడగా రాణిస్తున్నాడు. రిచర్వ్ టీం ఈవెంట్  లో, రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్ (2005, 2019) లో సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నాడు. ఆసియా క్రీడలలో రెండు పతకాలతో పాటు, 2005, 2019 లో ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలను కూడా గెలుచుకున్నాడు.

తరుణ్‌దీప్‌ రాయ్ అర్జున అవార్డు పొందాడా? అవును. తరుణ్‌దీప్‌ రాయ్ 2005 లో అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. కేవలం 21 సంవత్సరాల వయసులో అర్జున అవార్డును పొందాడు.

Also Read:

IND Vs NZ, WTC Final 2021 Day 2 Live: రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. క్రీజులో రోహిత్-శుభ్‌మన్‌గిన్..

Milkha Singh: మిల్కా సింగ్‌ను ‘ఫ్లయింగ్ సిక్కు’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా..? కారణం ఇదే..!

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..