IND Vs NZ, WTC Final 2021 Day 2 Live: బ్యాడ్ లైట్ కారణంగా నిలిచిపోయిన మ్యాచ్.. 64 ఓవర్లకు భారత్ స్కోర్ 146/3..
India vs New Zealand : భారతదేశం మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రెండవ రోజు మ్యాచ్ ప్రారంభమైంది.
India vs New Zealand : భారతదేశం మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రెండవ రోజు మ్యాచ్ ప్రారంభమైంది. జూన్ 18 శుక్రవారం సౌతాంప్టన్‌లో మ్యాచ్ ప్రారంభం కాగా, మొదటి రోజు వర్షం కారణంగా ఫస్ట్ సెషన్ రద్దయింది. ఇక మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మొదట బౌలింగ్‌ని ఎంచుకున్నాడు. దాంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు లేవు.
ఇప్పటి వరకు మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 63 ఓవర్లు ముగిసే సమయానికి 143 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, అజింక్య రహానే ఉన్నారు. కోహ్లీ 40 పరుగులు, రహానే 28 వ్యక్తిగత పరుగులు చేయగా.. ఇద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
LIVE NEWS & UPDATES
-
బ్యాడ్ లైట్ కారణంగా నిలిచిపోయిన మ్యాచ్ .. 64 ఓవర్లకు భారత్ స్కోర్ 146/3..
బ్యాడ్ లైట్ కారణంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ నిలిచిపోయింది. మ్యాచ్‌ని నిలిపివేసే సమయానికి 64 ఓవర్లు పూర్తవగా.. 3 వికెట్లు కోల్పోయిన భారత్ 146 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ఉన్న కోహ్లీ, రహానే. 44, 29 చొప్పున పరుగులు చేశారు.
-
రాణిస్తున్న టీమిండియా బ్యాట్స్‌మెన్.. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రహానే-కోహ్లీ..
సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తగా ఆడుతూనే మరోవైపు స్కోర్ బోర్డు పెంచుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ(40), రహానే (28) పరుగులు చేయగా.. ఇద్దరి భాగస్వామ్యంలో 50 పరుగులు చేశారు.
That’s a fine 50-run partnership between #TeamIndia Captain and his deputy.
Live – https://t.co/CmrtWsugSK #INDvNZ #WTC21 pic.twitter.com/9rE7eAUJra
— BCCI (@BCCI) June 19, 2021
-
-
సౌతీ బౌలింగ్‌లో రహానే ఫోర్.. భారత్ స్కోర్ 140/3..
అజింక రహానే టిమ్ సౌతీ బౌలింగ్ ఫోర్ కొట్టాడు. స్వ్కేర్ లెగ్ వద్ద ఫోర్ బాదాడు. ఈ నాలుగు పరుగులతో కోహ్లీ, రహానే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
-
మళ్లీ ప్రారంభమైన మ్యాచ్.. ఫీల్డ్ కవర్లను తొలగించిన నిర్వాహకులు..
లైటింగ్ సమస్య కారణంగా నిలిచిపోయిన మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. ఫీల్డ్ కవర్లను నిర్వాహకులు తొలగించారు. ఆటగాళ్లంతా మైదానంలోకి వచ్చింది. అయితే, ప్రస్తుత పరిస్థితులు బ్యాట్స్‌మెన్ ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంతి సరిగా కనిపించకపోవంతో బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు.
UPDATE – The covers are now off and play should resume shortly.#WTC21
— BCCI (@BCCI) June 19, 2021
-
అడ్డంకిగా మారిన లైటింగ్.. ఆగిపోయిన మ్యాచ్..
సౌతాంప్టన్‌లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మూడవ సెషన్‌లో మూడు ఓవర్లు కూడా పూర్తి కాకుండానే మ్యాచ్ మళ్లీ ఆగిపోయింది. ఆటగాళ్లు స్టేడియం నుంచి బయటకు వచ్చారు. లైటింగ్ సమస్యతో మ్యాచ్ నిలిచిపోయింది.
-
-
రాణిస్తున్న టీమిండియా బ్యాట్స్‌మెన్.. 50 ఓవర్లకు భారత్ స్కోర్ 106/3..
సౌతాంప్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోగా.. క్రీజ్‌లో ఉన్న ప్లేయర్లు జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచుతున్నారు. 50 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 106/3 గా ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, రహానే ఉన్నారు. 86 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 28 పరుగులు చేశాడు. 40 బంతులను ఫేస్ చేసిన రహానే 8 పరుగులు చేశాడు.
????#WTC21 pic.twitter.com/9oiYcc1fZu
— BCCI (@BCCI) June 19, 2021
-
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. 90 పరుగుల వద్ద పుజారా ఎల్బీడబ్ల్యూ ఔట్..
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు మరో షాక్ ఎదరైంది. భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. 90 పరుగుల వద్ద చటేశ్వర్ పుజారా ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు. 54 బంతులు ఆడిన పుజారా 2 ఫోర్లు కొట్టి 8 పరుగులు చేశాడు. పుజరా ప్లేస్‌లో అజింక్య రహానే బ్యాటింగ్‌కు వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 91/3. కాగా, క్రీజ్‌లో విరాట్ కోహ్లీ(17), అజింక్య రహానే(3) ఉన్నారు.
Final. 40.2: WICKET! C Pujara (8) is out, lbw Trent Boult, 88/3 https://t.co/CmrtWsugSK #INDvNZ #WTC21
— BCCI (@BCCI) June 19, 2021
-
కెప్టెన్ కోహ్లీ దూకుడు.. 40 ఓవర్లకు టీమిండియా స్కోర్ 84/2..
సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. ఓపెనర్ల నిష్క్రమణ తరువాత రంగంలోకి దిగిన కెప్టెన్ కోహ్లీ.. తొలుత నిలకడగా ఆడినా.. ప్రస్తుతం దూకుడు పెంచాడు. 40 ఓవర్లకు భారత్ స్కోర్ 84/2 గా ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో కెప్టెన్ కోహ్లీ, పుజారా ఉన్నారు. కోహ్లీ 17 పరుగులు చేయగా.. పుజారా 8 పరుగులు చేశాడు.
-
లంచ్‌టైమ్‌కి భారత్ స్కోర్ 69/2.. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, పుజారా..
సౌతాంప్టన్ వవేదిగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ సమయానికి 28 ఓవర్లు పూర్తవగా.. టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఇప్పటికే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ పెవిలియన్‌కు చేరగా.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, పుజారా క్రీజ్‌లో ఉన్నారు.
That’s Lunch on Day 2 of the #WTC21 Final!
6⃣9⃣ runs for #TeamIndia in the opening session 2⃣ wickets for New Zealand
The second session shall commene soon.
Scorecard ? https://t.co/CmrtWscFua pic.twitter.com/2LCZoHt48R
— BCCI (@BCCI) June 19, 2021
-
భారత్‌కు మరో షాక్.. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఔట్..
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు. నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో వేసిన బౌలింగ్‌లో షాట్ ప్రయత్నించగా.. బంతి నేరుగా వాట్లింగ్ చేతిలో పడింది. దాంతో శుభ్‌మన్ పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన శుభ్‌మన్.. 64 బంతులు ఆడి 3 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో పుజారా, విరాట్ కోహ్లీ ఉన్నారు.
Final. 24.3: WICKET! S Gill (28) is out, c BJ Watling b Neil Wagner, 63/2 https://t.co/CmrtWsugSK #INDvNZ #WTC21
— BCCI (@BCCI) June 19, 2021
-
జేమిసన్ వేసిన తొలి బంతికే ఔట్ అయిన రోహిత్ శర్మ..
గతేడాది భారత్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన జేమిసన్ తొలిసారి రోహిత్‌కు బౌలింగ్ చేసి తొలి బంతికే వికెట్ పొందాడు. ఈ స్పెల్‌లో జేమిసన్ ఇప్పటివరకు శుభ్‌మన్ గిల్‌కు మాత్రమే బౌలింగ్ చేశాడు. రోహిత్‌కు బౌలింగ్ చేసిన తొలి బంతిలోనే వికెట్ తీసుకుని భారత్‌కు షాక్ ఇచ్చాడు.
-
టీమిండియాకు షాక్.. క్యాచ్ అవుట్ అయిన రోహిత్ శర్మ..
టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్ జామిసన్ వేసిన బంతిని రోహిత్ శర్మ షాట్ కొట్టగా.. దానిని సౌతీ డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. దాంతో రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు. రోహిత్ 68 బంతులాడిన రోహిత్ శర్మ.. 34 పరుగులు చేశాడు. వీటిలో 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 23 ఓవర్లకు 62/1.
Final. 20.1: WICKET! R Sharma (34) is out, c Tim Southee b Kyle Jamieson, 62/1 https://t.co/CmrtWsugSK #INDvNZ #WTC21
— BCCI (@BCCI) June 19, 2021
-
సౌతాంప్టన్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్.. 17 ఓవర్లలో 50 పరుగులు చేసిన టీమిండియా..
సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. 17 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 50 దాటింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ(29), శుభ్‌మన్ గిల్(23) పరుగులతో రాణిస్తున్నారు.
#TeamIndia openers have got off to a great start here in the final of the #WTC21.
50-run partnership comes up between @ImRo45 & @RealShubmanGill ??
Follow the game here – https://t.co/tSsZ2pr0xm pic.twitter.com/VzU9NcKBoq
— BCCI (@BCCI) June 19, 2021
-
రాణిస్తున్న రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. 13 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 41/0
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందిస్తున్నారు. సౌతీ, బౌల్ట్ వంటి స్వింగ్ బౌలర్లకు ధీటుగా రాణిస్తూ స్కోర్‌ను పెంచుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 41/0 గా ఉంది. రన్ రేట్ 2.92గా ఉంది.
Final. 10.2: K Jamieson to S Gill (19), 4 runs, 41/0 https://t.co/CmrtWsugSK #INDvNZ
— BCCI (@BCCI) June 19, 2021
-
విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్.. అధిక టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా నిలిచి..
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సరికొత్త రికార్డ్ సృష్టించాడు. భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అధిక సంఖ్యలో టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కెప్టెన్‌గా విరాట్ నిలిచాడు.
Today, Virat Kohli is captaining India for the 61st time in Tests, the most by any Asian player. He betters MS Dhoni’s tally of 60 Tests. Behind them are Sri Lankan Arjuna Ranatunga & Pakistani Misbah-ul-Haq with 56 Tests each as captain.#INDvsNZ #WTCFinal #WTC21final #WTC
— Mohandas Menon (@mohanstatsman) June 19, 2021
-
మిల్కాసింగ్ మృతి.. చేతికి బ్లాక్ బ్యాండ్ ధరించిన టీమిండియా క్రికెటర్లు..
కారణంగా దేశం మొత్తం శోకంలో ఉంది. సౌతాంప్టన్‌లో, మిల్కా సింగ్ గౌరవార్థం భారత జట్టు చేతిలో బ్లాక్ బ్యాండ్‌తో ఫైనల్‌లోకి ప్రవేశించింది.
#TeamIndia is wearing black armbands in remembrance of Milkha Singhji, who passed away due to COVID-19. ?#WTC21
— BCCI (@BCCI) June 19, 2021
-
సౌతాంప్టన్ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రెండవ రోజూ వరుణ గండం..?
సౌతాంప్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రెండవ రోజు కూడా వరుణ గండం పొంచి ఉంది. నెమ్మదిగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే, ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉండటంతో.. నిర్వాహకులు మ్యాచ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
Morning catch-ups @BCCI ?#WTC21 pic.twitter.com/VrdaiMY0Yd
— BLACKCAPS (@BLACKCAPS) June 19, 2021
Published On - Jun 18,2021 3:14 PM