Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics: టోక్యో ‘ఒలింపిక్ విలేజ్‌’ ఫొటోలు విడుదల! జులై 23 నుంచి ఒలింపిక్ గేమ్స్

టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు ఆదివారం అథ్లెట్లు నివసించే, పోటీలు నిర్వహించే ప్రదేశాలను మీడియాకు విడుదల చేశారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ లో వివిధ దేశాలకు చెందిన దాదాపు 11,000 మంది అథ్లెట్లు పలు క్రీడల్లో పాల్గొనబోతున్నారు.

Tokyo Olympics: టోక్యో 'ఒలింపిక్ విలేజ్‌' ఫొటోలు విడుదల! జులై 23 నుంచి ఒలింపిక్ గేమ్స్
Olympic Village
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Jul 05, 2021 | 5:52 PM

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు ఆదివారం అథ్లెట్లు నివసించే, పోటీలు నిర్వహించే ప్రదేశాలను మీడియాకు విడుదల చేశారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ లో వివిధ దేశాలకు చెందిన దాదాపు 11,000 మంది అథ్లెట్లు పలు క్రీడల్లో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు వారి కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. గతేడాది జరగాల్సిన ఈ పోటీలు కరోనాతో వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జులై 23 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడానికి రానున్నారు. అయితే ఇంతమంది రావడం వల్ల కోవిడ్ వ్యాప్తి మరింత పెరుగుతుందనే ఆందోళనల మధ్య ఈ క్రీడలు మొదలు కానున్నాయి. ఎట్ట పరిస్థితుల్లోనూ గేమ్స్ నిర్వహిస్తామని ఒలింపిక్స్ సంఘం, టోక్యో ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఈ మేరకు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మీడియాకు విడుదల చేశారు.

జపాన్ లో టీకా కార్యక్రమం చాలా స్లోగా జరుగుతోంది. అన్ని దేశాలతో పోల్చితే ప్రజలకు వ్యాక్సిన్ అందించే కార్యక్రమం చాలా నెమ్మదిగా సాగుతోంది. దీంతో ప్రభుత్వం నిర్వహించాలనుకుంటున్న ఈ ఒలింపిక్స్ ఆటలను హాస్పిటల్స్, వైద్య సంఘాలు విమర్శిస్తున్నాయి. దేశంలో వైద్య వ్యవస్థ చాలా వెనుంజలో ఉందని పేర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహిస్తే.. దేశంలో పరిస్థితులు చేజారిపోతాయని పేర్కొంటున్నారు. అయితే, తాజాగా శనివారం ఒలింపిక్స్ ముందు నిర్వహించే సన్నాహక శిబిరాల కోసం జపాన్ చేరుకున్న ఉగాండా క్రీడాకారిణికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పబ్లిక్ బ్రాడ్‌ కాస్టర్ ఎన్‌హెచ్‌కే ఈ విషయాన్ని వెల్లడించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఆదేశంలో పలు సంఘాలు ఆరోపనలకు తాజా సంఘటన బలం చేకూర్చినట్లైంది.

మరోవైపు అక్కడికి చేరుకున్న అథ్లెట్లకు ఒలింపిక్ గ్రామంలో వసతికి ఏర్పాటు చేశారు. మరికొంత మంది అథ్లెట్ విలేజ్‌కు బయట కూడా ఏర్పాట్లు చేశారు. ఈమేరకు వీరికి ప్రతిరోజూ కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఒలింపిక్ రూల్స్ ను కచ్చితంగా అథ్లెట్లు పాటించాలని పేర్కొంది. ఈవెంట్స్ సమయంలో తప్ప మిగతా అన్ని సమయాల్లో తప్పకుండా మాస్క్ ను విధిగా ధరించాలని వెల్లడించింది. అథ్లెట్ విలేజ్‌లో షాపింగ్ మాల్స్, ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ (ఏటీఎం), డ్రై క్లీనర్, పోస్ట్ ఆఫీస్, బ్యాంక్, కొరియర్ కౌంటర్ లను ఏర్పాటు చేశారు.

“ఈ ప్రాంతానికి సాంప్రదాయ జపనీస్ లుక్ ఇచ్చేందుకు బేర్ బల్బులకు బదులు మేము ఈ ప్రాంతంలో లాంతర్లను ఏర్పాటు చేశామని” నిర్వాహకులు మీడియాతో వెల్లడించారు.

జపనీస్ మినిమలిస్ట్ డిజైన్ లను కలబోసి నేషనల్ స్టేడియంతో సహా ఒలింపిక్స్ వేదికల నిర్మాణంలో కలపను ఉపయోగించారు. టోక్యో 2020 థీమ్‌ను అనుసరించి ఇలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. జపాన్‌లోని 63 ప్రభుత్వ మున్సిపల్స్‌ విరాళంగా ఇచ్చిన 40,000 కలప ముక్కలతో 2.4 బిలియన్ యెన్ ( 21.8 మిలియన్లు) ఖర్చుతో ఈ షాపింగ్ ప్రాంతాన్ని నిర్మించినట్లు వారు పేర్కొన్నారు. ఒలింపిక్ గేమ్స్ అనంతరం ఈ షాపింగ్ ప్రాంతాన్ని కూల్చివేస్తారు. దీంట్లో ఉపయోగించిన కలపను స్థానిక అవసరాల కోసం తిరిగి వాడుకుంటారు. షాపింగ్ ప్లాజాలో నిర్మించిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ 23 భవనాలలో సుమారు 12,000 మంది ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో దుకాణాలు, ఉద్యానవనం, పాఠశాల ఉన్నాయి. ఒలింపిక్స్ గేమ్స్ పూర్తయ్యాక ఈ భవనాలను ఫ్లాట్‌లుగా మార్చనున్నట్లు పేర్కొన్నారు.

ఇక్కడ నిర్మించిన నిర్మాలతో పాటు రహదారులు అలాగే మౌలిక సదుపాయాల కోసం టోక్యో గృహనిర్మాణ సంస్థకు 54 బిలియన్ యెన్లు ఖర్చయ్యాయని సమాచారం. అలాగే చాలా విశాలమైన భోజన శాలను కూడా నిర్మించారు. ఇందులో ఒకేసారి 4,500 మంది కూర్చుని భోజనాలు చేసేంత సామర్థ్యం ఉందంట. కోవిడ్ రూల్స్ పాటిస్తూ భోజనాలు చేయాలని అథ్లెట్లను కోరారు.

Also Read:

Sachin Tendulkar: ‘గ్రేటెస్ట్‌ మెన్స్‌ టెస్ట్‌ బ్యాట్స్‌ మెన్‌’ గా ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎన్నిక !

Tokyo Olympics: ప్రముఖ భారతీయ ఆర్చర్ తరుణ్‌దీప్‌ రాయ్ గురించి మీకు తెలియని 10 విషయాలు..!