Tokyo Olympics: జపాన్ నిబంధనలు చాలా దారుణం: భారతీయ ఒలింపిక్ అసోసియేషన్‌ ప్రతినిధులు

టోక్యో ఒలింపిక్స్ గేమ్స్‌ కోసం వెళ్లనున్న భారత అథ్లెఅథ్లెట్లు, వారితోపాటు ప్రయాణిస్తున్న అధికారులను ప్రయాణానికి ఒక వారం ముందు నుంచి ప్రతి రోజూ కోవిడ్ టెస్టులు చేసుకోవాలిన జపాన్ ప్రభుత్వం కోరింది.

  • Updated On - 5:52 pm, Mon, 5 July 21 Edited By: Anil kumar poka
Tokyo Olympics: జపాన్ నిబంధనలు చాలా దారుణం: భారతీయ ఒలింపిక్ అసోసియేషన్‌ ప్రతినిధులు
Indian Olympic Association

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ గేమ్స్‌ కోసం వెళ్లనున్న భారత అథ్లెట్లు, వారితోపాటు ప్రయాణిస్తున్న అధికారులను ప్రయాణానికి ఒక వారం ముందు నుంచి ప్రతి రోజూ కోవిడ్ టెస్టులు చేసుకోవాలిన జపాన్ ప్రభుత్వం కోరింది. అలాగే టోక్యో చేరుకున్న తరువాత మూడు రోజుల వరకు ఎవరితోనూ మాట్లాడవద్దని ఆదేశాలు జారీచేసింది. ఈ రూల్స్ కచ్చితంగా పాటించాలని ఐఓఏ ని కోరింది. టోక్యోకు చేరుకున్న తరువాత 14 రోజుల పాటు కఠిన నిబంధనలు అమలుచేయనున్నట్లు తెలుస్తోంది. భారత్ సహా 11 దేశాల అథ్లెట్లు, కోచ్‌లు వీరితో పాటు వచ్చే సహాయక సిబ్బందికి ఈ రూల్స్ వర్తిసాయని జపాన్ ప్రభుత్వం పేర్కొంది.

అయితే, ఈ నిబంధనల పట్ల భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భారతదేశంలో ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గిందని, మూడు వారాల క్రితం 3 లక్షల కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం ఆ సంఖ్య 60,000లోపే ఉందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో పరిస్థితి చాలా మెరుగుపడిందని, అథ్లెట్లు చాలా రూల్స్ పాటిస్తున్నారని, వారం రోజుల పాటు కరోనాపరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పడం ఏంటని ఆరోపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలతో పాటు భారత్ ను గ్రూప్ 1 దేశాల జాబితాలో చేర్చారు.

“మీరు జపాన్ బయలుదేరే ముందు ఏడు రోజులపాటు ప్రతిరోజూ ఏడు రోజులపాలు కరోనా పరీక్షలు చేసుకోవాలని” గ్రూప్ 1 దేశాలకు ఆదేశాలు జారీ చేసింది జపాన్ ప్రభుత్వం. “మీరు జపాన్ బయలుదేరడానికి ఏడు రోజుల ముందు ఇతర ఆటగాళ్లు, వ్యక్తులు, ఇతర దేశాల వ్యక్తులు, విదేశీ ఆటగాళ్లకు చాలా దూరం ఉండాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ” సూచించింది.

ఇక జపాన్ చేరుకున్నాక అథ్లెట్లు, అధికారులు, సహాయక సభ్యులు మూడు రోజుల పాటు వేరెవరితోనూ మాట్లాడకూడదని, దీనికి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని జపాన్ పేర్కొంది. అథ్లెట్లు, అధికారులందరికీ ప్రతిరోజూ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొంది. అథ్లెట్లు వారి పోటీలు ప్రారంభమయ్యే ఐదు రోజుల ముందు గేమ్స్ విలేజ్‌లోకి వెళ్లాలని కోరింది. అంతకుముందు అక్కడికి అనుమతించబోమని వెల్లడించింది. ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా, సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా సంయుక్తంగా ఈ నిబంధనలు తప్పుబట్టారు.

“క్రీడాకారులు తమ పోటీలకు 5 రోజుల ముందు మాత్రమే గేమ్స్‌ విలేజ్‌కు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. మరి అప్పటివరకు గదులకే పరిమితం కావలి, అలా 3 రోజులు వృధా అవుతాయి. భారతీయ అథ్లెట్లకు చాలా అన్యాయంగా ఈ రూల్స్ ఉన్నాయని ” వీరు ఆరోపించారు. “ఈ 3 రోజులలో అథ్లెట్లకు అల్పాహారం, లంచ్, డిన్నర్ మొదలైనవి ఎక్కడ, ఎప్పుడు ఇస్తారో వెల్లడించలేదు. గేమ్స్‌ విలేజ్‌లోనే భోజనాలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరి 3 రోజుల పాటు అక్కడికి వెళ్లకుండా ఎలా భోజనాలు చేస్తారని” ప్రశ్నించారు.

Also Read:

Tokyo Olympics: టోక్యో ‘ఒలింపిక్ విలేజ్‌’ ఫొటోలు విడుదల! జులై 23 నుంచి ఒలింపిక్ గేమ్స్

Sachin Tendulkar: ‘గ్రేటెస్ట్‌ మెన్స్‌ టెస్ట్‌ బ్యాట్స్‌ మెన్‌’ గా ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎన్నిక !

Click on your DTH Provider to Add TV9 Telugu