Sachin Tendulkar: ‘గ్రేటెస్ట్ మెన్స్ టెస్ట్ బ్యాట్స్ మెన్’ గా ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎన్నిక !
భారత లెజెండ్ సచిన్ రమేష్ టెండూల్కర్ 21 వ శతాబ్దానికి చెందిన 'గ్రేటెస్ట్ మెన్స్ టెస్ట్ బ్యాట్స్ మెన్' గా ఎన్నికయ్యాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుమార్ సంగక్కరతో గట్టి పోటీ ఎదుర్కొని విజేతగా నిలిచాడు.
Sachin Tendulkar: టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను 21 వ శతాబ్దంలో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్ మెన్ గా స్టార్ స్పోర్ట్స్ బృందం ఎన్నుకుంది. ఈ పోటీలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కరతో గట్టి పోటీ ఎందురైందని, అయితే చివరకు మాస్టర్ బ్లాస్టర్ విజేతగా నిలిచినట్టు ప్యానల్ పేర్కొంది. ఈ ప్యానల్‌లో వీవీఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాష్ చోప్రా ఇంకా మరెందరో మాజీ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్‌లో చేసిన అద్భుతమైన కృషికి గాను భారత మాజీ క్రికెటర్లు సచిన్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు.
“ఇది చాలా గట్టి పోటీ. కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్ ఇద్దరూ క్రికెట్ కి రెండు చిహ్నాలు. అయినా ఇది పోటీ కనుక ఒకరే విజేతగా నిలవాలి. అందుకే నా తోటి ముంబైకర్ సచిన్ రమేష్ టెండూల్కర్ కే నా ఓటు అంటూ” గవాస్కర్ మాట్లాడుతున్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ పంచుకుంది.
ఎనిమిదేళ్ల క్రితం 2013 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సచిన్.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ అయిన బ్రియాన్ లారా, రికీ పాంటింగ్, జాక్వెస్ కాలిస్, రాహుల్ ద్రవిడ్, అలీస్టర్ కుక్ ఇంకా మరెందరితోనో కలిసి జర్నీ చేశాడు. అలాంటి ఓ గొప్ప క్రికెటర్‌కి ఇది ఓ గొప్ప గౌరవం అని వారు పేర్కొన్నారు. 15, 921 పరుగులతో సచిన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అలాగే 51 సెంచరీలతోనూ అందరి కంటే ఎంతో ముందున్నాడు. 45 సెంచరీలతో దక్షిణాఫికా ఆటగాడు కల్లీస్ రెండో స్థానంలో నిలిచాడు. 38 సెంచరీలతో సంగక్కర అత్యధిక సెంచరీల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. అలాగే టెస్టుల్లో ఆల్ టైమ్ పరుగుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.
భారత మాజీ కెప్టెన్ టెండూల్కర్.. పాకిస్తాన్‌పై 16 సంవత్సరాల వయసులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. 17 సంవత్సరాల 107 రోజుల వయసులో టెండూల్కర్ తన తొలి సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా తరపును టెస్టుల్లో సెంచరీ నమోదు చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటికీ ఎవరీకి అందనంత ఎత్తులో ఉంది. అక్కడి నుంచి టెండూల్కర్ జర్నీ ఎంతో ఆదర్శంగా తయారైంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి విభిన్న పరిస్థితుల్లోనూ శతకాలు బాది ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదిగాడు.
2002 లో, తన కెరీర్‌లో విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ లో ప్రపంచంలోనే గొప్ప టెస్ట్ బ్యాట్స్‌మన్ లలో రెండో స్థానం సంపాదించాడు. మొదటి స్థానంలో డాన్ బ్రాడ్‌మాన్ ఉన్నాడు. అలాగే వివ్ రిచర్డ్స్ తర్వాత వన్డే బ్యాట్స్‌మన్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అలాగే 2010లో సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కూడా గెలుచుకుని క్రికెట్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగాడు.
ఇక ఇండియాలో ఉన్న స్పోర్ట్స్ అవార్డులను గెలచుకున్న మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు. అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్నతోపాటు భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం పద్మ భూషణ్, పద్మ విభూషణ్, అంతకంటే గొప్పదైన భారత్ రత్నఅవార్డులు ఆయన చెంత చేరాయి.
Master Blaster >>>> Everyone else ?
It was a close call, but in the end, our jury ??? y’all ?️ for the legendary @sachin_rt as the #GOATOfThe21stCentury Men’s Test Batsman! pic.twitter.com/2btk4bGI7U
— Star Sports (@StarSportsIndia) June 19, 2021
Also Read:
WTC Final 2021 IND vs NZ : సౌతాంప్టన్‌లో తాజా వాతావరణ పరిస్థితులు.. మూడో రోజు ఆట కొనసాగేనా..?