AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final 2021: పుజారాకు తప్పిన ప్రమాదం.. బాల్ తగిలి పగిలిన హెల్మెట్! వీడియో వైరల్

సౌథాంప్టన్ వేదికగా కివీస్, భారత్ జట్ల మధ్య ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఆట పూర్తిగా వర్షంతో సాధ్యం కాలేదు. ఇక రెండో రోజు నుంచి ఆట మొదలైంది.

WTC Final 2021: పుజారాకు తప్పిన ప్రమాదం.. బాల్ తగిలి పగిలిన హెల్మెట్! వీడియో వైరల్
Nasty Blow On Helmet
Venkata Chari
|

Updated on: Jun 20, 2021 | 4:28 PM

Share

WTC Final 2021: సౌథాంప్టన్ వేదికగా కివీస్, భారత్ జట్ల మధ్య ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఆట పూర్తిగా వర్షంతో సాధ్యం కాలేదు. ఇక రెండో రోజు నుంచి ఆట మొదలైంది. టాస్ గెలిచిన కివీస్ భారత్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో టీమిండియా ఆటను ప్రారంభించింది. శుభ్‌మన్ గిల్(28 పరుగులు, 64 బంతులు, 3 ఫోర్లు) ఔటయ్యాక చతేశ్వర్ పుజారా(8 పరుగులు, 54 బంతులు, 2 ఫోర్లు) క్రీజులోకి వచ్చాడు. అయితే, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ విసిరిన బౌన్సర్ బంతితో పుజారాకు కొద్దిలో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. వాగ్నర్ వేసిన బంతిని ఫుల్ చేసేందుకు పుజారా ప్రయత్నించాడు. కానీ.. ఆ బాల్ బ్యాట్‌కి దొరకకుండా నేరుగా వెళ్లి పుజారా హెల్మెట్‌కి గట్టిగా తగిలింది. దీంతో హెల్మెట్‌‌లోని కొంత భాగం ఎగిరి క్రీజులో పడింది. బాల్ హెల్మెట్ కి తగిలింది కాబట్టి సరిపోయింది. లేదంటే పుజారాకు ప్రమాదం జరిగేదనంటూ సోషల్ మీడియాలో పుజారా ఫొటోను షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

పుజారా పరుగుల ఖాతా తెరిచేందుకు 35 బంతుల్ని తీసుకున్నాడు. 37వ ఓవర్ వేసిన వాగ్నర్.. గంటకి 130కిమీ వేగంతో బంతులను విసురుతున్నాడు. ఆ బాల్‌ను పుజారా ఒక్కసారిగా ఫుల్ చేయబోయాడు. కానీ.. ఆ బంతి బలంగా పుజారా హెల్మెట్‌కి తాకింది. దీంతో వెంటనే బౌలర్ వాగ్నర్ పుజారాకి సారీ చెప్పాడు. అనంతరం టీమిండియా ఫిజియో గ్రౌండ్‌లోకి వచ్చి పుజారాతో సంభాషించాడు. ఎలాంటి గాయం కాకపోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. అంతకముందు ఓపెనర్ శుభమన్ గిల్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మరోవైపు విరాట్ కోహ్లీ విషయంలో ఫీల్డ్ అంపైర్ కూడా అత్యుత్సాహం చూపాడంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు.

Also Read:

Sachin Tendulkar: ‘గ్రేటెస్ట్‌ మెన్స్‌ టెస్ట్‌ బ్యాట్స్‌ మెన్‌’ గా ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎన్నిక !

WTC Final 2021: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అంపైర్ల తీరుపై సెహ్వాగ్ చురకలు..! కివీస్‌కి సాయం చేశారంటూ నెటిజన్ల విమర్శలు