WTC Final 2021: పుజారాపై పేలుతోన్న మీమ్స్.. ఒక్క పరుగు కోసం అన్ని బంతులా!

Venkata Chari

Venkata Chari |

Updated on: Jun 20, 2021 | 8:35 PM

టీమిండియా బ్యాట్స్‌మెన్ చతేశ్వర్‌ పుజారా పై సోషల్ మీడియాలో మీమ్స్ ఫెస్ట్ జరుగుతోంది. శనివారం పుజారా ఆటతీరుపై టీమిండియా ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు.

WTC Final 2021: పుజారాపై పేలుతోన్న మీమ్స్.. ఒక్క పరుగు కోసం అన్ని బంతులా!
Memes On Pujara

WTC Final 2021: టీమిండియా బ్యాట్స్‌మెన్ చతేశ్వర్‌ పుజారా పై సోషల్ మీడియాలో మీమ్స్ ఫెస్ట్ జరుగుతోంది. శనివారం పుజారా ఆటతీరుపై టీమిండియా ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు. సౌథాంప్టన్‌లో కివీస్, భారత్‌ టీంల మధ్య జరుగుతోన్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం పుజారా బ్యాటింగ్ కు వచ్చిన క్రమంలో పరుగులు సాధించేందుకు చాలా కష్టపడ్డాడు. తొలి పరుగు సాధించేందుకు 36 పరుగులు తీసుకున్నాడు. టీం ప్రయోజనాలకు తగినట్లుగా ఆడలేదంటూ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో టీమిండియా నయావాల్ పై సోషల్ మీడియాలో మీమ్స్ క్రియోట్ చేసి అసహనం ప్రదర్శించారు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కివీస్.. భారత జట్టును బ్యాటింగ్‌కు పిలిచింది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ 34 పరుగులు, శుభ్‌మన్‌ గిల్‌ 28 పరుగులు చేసి ఔటయ్యారు. ఓపెనర్లు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన చతేశ్వర పుజారా ప‌రుగుల ఖాతా తెరేచేందుకు 36 బంతులు ఆడాడు. 36వ బంతికి ఫోర్ కొట్టి పరుగుల ఖాతా ఓపెన్ చేశాడు. ఆ వెంటనే మ‌రో ఫోర్ కొట్టి ఫాంలోకి వచ్చినట్లే అనిపించాడు. కానీ ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. 54 బంతుల్లో 8 ప‌రుగులు చేసి బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌పై మీమ్స్‌ పేలుతున్నాయి.

Also Read:

Tokyo Olympics: “నాన్న కల నిజమైంది. కానీ, నేడు ఆయన నా పక్కన లేడు”: హాకీ క్రీడాకారిణి లాల్‌రెమియామి

WTC Final 2021: పుజారాకు తప్పిన ప్రమాదం.. బాల్ తగిలి పగిలిన హెల్మెట్! వీడియో వైరల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu