AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘భాంగ్రా’ స్టెప్పులతో అదరగొట్టిన కోహ్లీ… మ్యాచ్ గెలిస్తే మేము డ్యాన్ చేస్తామంటోన్న ఫ్యాన్స్! వైరలవుతోన్న వీడియో!

డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా సోషల్ మీడియాలో రోజుకోరకంగా పండుగ చేసుకుంటున్నారు నెటిజన్లు. మొదటి రోజు వర్షంతో ఆట రద్దైనప్పుడు మీమ్స్‌తో చెలరేగిపోయారు.

Viral Video: 'భాంగ్రా' స్టెప్పులతో అదరగొట్టిన కోహ్లీ... మ్యాచ్ గెలిస్తే మేము డ్యాన్ చేస్తామంటోన్న ఫ్యాన్స్! వైరలవుతోన్న వీడియో!
Virat Bhangra Dance In Wtc Final 2021
Venkata Chari
|

Updated on: Jun 21, 2021 | 6:47 AM

Share

WTC Final 2021: డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా సోషల్ మీడియాలో రోజుకోరకంగా పండుగ చేసుకుంటున్నారు నెటిజన్లు. మొదటి రోజు వర్షంతో ఆట రద్దైనప్పుడు మీమ్స్‌తో చెలరేగిపోయారు. అలాగే రెండో రోజు పుజారా హెల్మెట్ కి బంతి తాకినప్పడు.. తొలి పరుగు కోసం 36 బంతులు తీసుకున్నప్పుడు పుజారాపై మీమ్స్ అదరగొట్టేశారు. మరోసారి కోహ్లీ ఔట్ కోసం అంపైర్టు చేసిన హాడావుడిపై సెహ్వాగ్ సైతం చురకలు అంటిస్తూ.. తమాషా అంపైరింగ్ అంటూ కామెంట్లు చేశారు. ఇలా రోజుకో రకంగా సోషల్ మీడియాలో డబ్ల్యూటీసీ ఫైనల్ పై మీమ్స్ పేలుతున్నాయి. తాజాగా విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ సమయంలో భాంగ్రా స్టెప్పులు వేస్తూ.. నెటిజన్లకు ట్రీట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సైతం కామెంట్లతో హల్‌చల్ చేస్తున్నారు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్సింగ్స్ మొదలు పెట్టింది. కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్లిప్స్‌లో విరాట్ కోహ్లీ, పుజారా, రోహిత్ ల పక్కన కీపర్ పంత్ ఉన్నారు. దీంతో సరదాగా విరాట్ కోహ్లీ భాంగ్రా స్టెప్పులు అందుకున్నాడు. కొద్దిసేపు డ్యాన్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.

అప్పుడప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పిచ్‌లో లేదా బయట ఇలాంటి డ్యాన్స్‌ను వేస్తూనే ఉంటాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 3 వ రోజు రెండో సెషన్‌లో మరోసారి ఇదే తరహా డ్యాన్స్ చేస్తూ కెమెరా కంట చిక్కాడు.

దీంతో ఇక ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సౌతాంప్టన్‌లో జరిగే ఫైనల్‌లో భారత్ విజయం సాధిస్తుందనేందుకు సంకేతాలు ఇవేనంటూ కామెంట్లు చేశారు. మరికొంతమంది మాత్రం ముందు మ్యాచ్ గెలవండి.. ఆతరువాత మీతో పాటు మేము కూడా డ్యాన్స్ చేస్తామంటూ సరదగా కామెంట్లు పంచుకున్నారు.

భారత్ ఆర్మీ సైతం ‘మేము మిమ్మల్ని రాక్ చేస్తాం’ అంటూ.. భారత క్రికెట్ జట్టు అభిమానుల బృందానికి (భారత్ ఆర్మీ ) ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఉంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉత్సాహపరిచేందుకు భారత ఆర్మీ సైతం రంగంలోకి దిగింది. వారు కొత్తగా రీమేక్ చేసిన పాట “వీ విల్ రాక్ యూ” ను అందుకుంటూ విరాట్ కోహ్లీకి అంకింతం చేశారు.

కోహ్లీ భాంగ్రా స్టెప్పులను మీరూ చూడండి:

Also Read:

IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: ముగిసిన మూడవ రోజు ఆట.. న్యూజిలాండ్ స్కోర్ 101/2…

WTC Final 2021: పుజారాపై పేలుతోన్న మీమ్స్.. ఒక్క పరుగు కోసం అన్ని బంతులా!

Tokyo Olympics: “నాన్న కల నిజమైంది. కానీ, నేడు ఆయన నా పక్కన లేడు”: హాకీ క్రీడాకారిణి లాల్‌రెమియామి

Indian Sailor KC Ganapathy: భారత సెయిలర్‌ కేసీ గణపతి గురించి మీకు తెలియని విషయాలు..!

WTC Final 2021: పుజారాకు తప్పిన ప్రమాదం.. బాల్ తగిలి పగిలిన హెల్మెట్! వీడియో వైరల్