International Yoga Day 2021: “ప్రపంచానికి యోగా నేర్పిన ఘనత భారత్‌ దే”: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్

ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన గొప్ప బహుమతుల్లో ధ్యానం ఒకటని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ 7 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుర్తుచేశాడు.

International Yoga Day 2021: "ప్రపంచానికి యోగా నేర్పిన ఘనత భారత్‌ దే": భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్
Yoga Day 2021

International Yoga Day 2021: ప్రపంచం వ్యాప్తంగా 7 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే, భారత క్రికెట్ మాజీలు యోగాసనాలు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఐడీవై) నిర్వహిస్తున్నారు. ‘యోగా ఫర్ వెల్నెస్’ అనే థీమ్ తో ఐడీవై సెలబ్రేట్ చేస్తోంది. శారీరక, మానసిక ఉల్లాసం కోసం యోగా సాధన చేయడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీరేందర్ సెహ్వాగ్ మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతులలో ధ్యానం ఒకటని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. అలాగే #InternationalDayOfYoga అంటూ హ్యాష్‌టాగ్ చేర్చాడు.

భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా యోగా చేస్తున్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. “యోగా మీ జీవితాన్ని ఎన్నో ఏళ్లకు పెంచుతుంది. సంతోషంగా జీవించేందుకు కారణం అవుతుంది. మీ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చాడు.

అలాగే మాజీ ఆల్ రౌండర్ సురేష్ రైనా సూర్యనమస్కారాలు, యోగాసనాలు వేస్తున్న ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. “ఈ ఇంటర్నేషనల్ యోగా డే ప్రకృతిలో మమేకమవ్వాలని, మనస్సు, శరీరం, ఆలోచనల్నీ ఏకం చేస్తోంది. మన రోజువారీ దినచర్యలో యోగాను చేర్చడంతో మన ఆరోగ్యం మరింత రెట్టింపు అవుతోంది. ఈ యోగాలో యువతను కూడా పాల్గొనేలా చేస్తే మంచిది” అని తెలిపాడు.

భారత మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కూడా యోగాసనాలు చేస్తోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. సూర్య నమస్కారంతో రోజును ప్రారంభిస్తే మన శరీరానికి ఎంతో మంచిదని, యోగా కు ప్రపంచ వ్యాప్తంగా ఒకరోజు కేటాయించడం హర్షించదగినదని పేర్కొన్నాడు.

జూన్ 21 కి ముందే అంటే దాదాపు 3 నుంచి 4 నెలల ముందే యోగా డే కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సిద్ధమవుతారు. ఇందుకోసం ఐడీవై ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. ప్రజలంతా సామూహికంగా ఇందులో భాగస్వామ్యమయ్యేలా తన వంతు పాత్రను పోషిస్తోంది.

అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారితో ప్రజలలో అంతర్గత శక్తిని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసిందని, ప్రతికూలతను మనకు అనుకూలంగా మార్చుకునేందుకు యోగా తగిన పాత్ర పోషిస్తుందని అన్నారు.

“యోగా మనకు ఒత్తిడి నుంచి బలం.. అలాగే ప్రతికూలత నుంచి సృజనాత్మకత వైపు పయణించేందుకు మార్గం చూపిస్తుందని, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ, మనలో అనంతమైన పరిష్కారాలను కనుగొనే శక్తి దాగి ఉందని యోగా వెల్లడిస్తుందని” 7 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి పీఎం నరేంద్ర మోడీ ప్రసంగించారు.

Also Read:

Milkha Singh: “రియల్ హీరోకు.. రీల్ హీరోకి తేడా తెలియదా”..! నోయిడా స్టేడియం సిబ్బందిపై నెటిజన్ల ఫైర్

Tokyo 2020 Summer Olympics: పీవీ సింధు ఒలింపిక్ పతకం సాధించడం అంత సులభం కాదు: జ్వాలా గుత్తా

Viral Video: ‘భాంగ్రా’ స్టెప్పులతో అదరగొట్టిన కోహ్లీ… మ్యాచ్ గెలిస్తే మేము డ్యాన్ చేస్తామంటోన్న ఫ్యాన్స్! వైరలవుతోన్న వీడియో!

IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: ముగిసిన మూడవ రోజు ఆట.. న్యూజిలాండ్ స్కోర్ 101/2…