IND Vs NZ, WTC Final 2021 Day 4 Live: జోరుగా కురుస్తోన్న వర్షం.. ప్రారంభం కాని నాలుగో రోజు ఆట..
India vs New Zealand Live Score: సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడుగడుగునా అడ్దోస్తున్నాడు....
India vs New Zealand Live Score: సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడుగడుగునా అడ్దోస్తున్నాడు. మొదటి రోజు వర్షం కారణంగా ఆటను రద్దు చేయగా.. రెండో రోజు కూడా ఓవర్ల కోటాను పూర్తి కాకముందే వర్షం అనుకోని అతిధిలా పలకరించింది. అటు మూడో రోజు కూడా బ్యాడ్ లైట్ కారణంగా ఆట ముందుగానే ముగిసింది.
ఇదిలా ఉంటే ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 92.1 ఓవర్లకు 217 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ కోహ్లీ(44), వైస్ కెప్టెన్ రహనే(44), రోహిత్ శర్మ(34)లు ఫర్వాలేదనిపించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ బాట పట్టారు. న్యూజిలాండ్ బౌలర్లలో జమీసన్ 5 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, వేగ్నర్ రెండేసి వికెట్లు, సౌథీ ఒక వికెట్ తీశారు.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరభించిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. లాధమ్(30), కాన్‌వే(54)లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీం స్కోర్ 74 పరుగుల వద్ద లాధమ్(30) అవుట్ కాగా.. కాన్‌వే మాత్రం అద్భుతమైన అర్ధ శతకం చేసి అదరగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కేన్ విలియమ్సన్(12), రాస్ టేలర్(0) ఉన్నారు. 49 ఓవర్లకు న్యూజిలాండ్ రెండు వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు.
కాగా, నిర్ణయాత్మకమైన నాలుగో రోజు కూడా వర్షం అడ్డంకిగా మారింది. సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి జోరుగా కురుస్తోంది. దీనితో స్టేడియం చిత్తడిగా మారింది. మరి వరుణుడు ఈరోజు కరుణిస్తాడా.? లేదా.? అనేది చూడాలి.
LIVE NEWS & UPDATES
-
మరోసారి వరుణుడి అడ్డంకి.. నాలుగో రోజు మొదటి సెషన్ రద్దు..
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు మరోసారి వరుణుడు అడ్డంకిగా మారడంతో మొదటి సెషన్‌ను అంపైర్లు రద్దు చేశారు. దీనితో తొందరగానే లంచ్ బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం సౌతాంప్టన్‌లో వర్షం కురవకపోవడంతో మరికాసేపట్లో మ్యాచ్ మొదలయ్యే అవకాశం ఉంది.
-
సౌతాంప్టన్‌లో ఆగిన వర్షం..
ఎట్టకేలకు ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. సౌతాంప్టన్‌లో వర్షం ఆగిపోయింది. వాతావరణం కూడా ఫుల్‌గా మారడంతో కాసేపట్లో మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
-
-
ఈ రోజు కూడా అదే కారణం.. బ్యాడ్ వెదర్..
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను బ్యాడ్ వెదర్ అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా ఆట మొదలు కాలేదు అని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.
It continues to drizzle and we have to state the obvious.
Start of play on Day 4 has been delayed. ☔⌛#WTC21
— BCCI (@BCCI) June 21, 2021
-
ముంచుకొచ్చిన వర్షం.. మొదలు కాని నాలుగో రోజు ఆట..
ఇప్పుడు నాలుగో రోజు కూడా మొత్తంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌథాంప్టన్‌లో సోమవారం రోజంతా వర్షం పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది.
Hello and good morning from Southampton. We are 90 minutes away from scheduled start of play on Day 4, but this is what it looks like currently. #TeamIndia #WTC21 pic.twitter.com/FoXiut9MYj
— BCCI (@BCCI) June 21, 2021
Published On - Jun 21,2021 5:39 PM