WTC Final 2021: భారత పేసర్లపై నెటిజన్ల సెటైర్లు..! భువీ లేకపోవడమే లోటంటూ కామెంట్లు

డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను తీసుకోకపోవడంపై ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భువీ ఉండి ఉంటే కివీస్ బౌలర్లు ఈ పాటికి పెవిలియన్ చేరేవారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

WTC Final 2021: భారత పేసర్లపై నెటిజన్ల సెటైర్లు..! భువీ లేకపోవడమే లోటంటూ కామెంట్లు
Bhuvaneshwar Kumar
Follow us
Venkata Chari

|

Updated on: Jun 21, 2021 | 4:28 PM

WTC Final 2021: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను తీసుకోకపోవడంపై ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భువీ ఉండి ఉంటే కివీస్ బ్యాట్స్‌మెన్స్‌ ఈ పాటికి పెవిలియన్ చేరేవారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సౌథాంప్టన్‌లో ప్రస్తుత వాతావరణంలో భువనేశ్వర్ బౌలింగ్ బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అదనపు స్వింగ్‌ లభించే ఇంగ్లీష్ పిచ్‌లపై భువీ అధిక ప్రభావం చూపించేవాడని అంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కివీస్ ఓపెనర్లు 34 ఓవర్ల వరకు ఔట్ కాకపోవడంతో భువనేశ్వర్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. భువనేశ్వర్‌ కుమార్‌ను ఇంగ్లాండ్‌ పర్యటనకు సెలక్టర్లు ఎంపిక చేయకపోవడంతో… పలు అనుమానాలు వ్యక్త మయ్యాయి. భువీ ఇక టెస్టులకు స్వస్తి చెప్పనున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీంతో భువీ వెంటనే క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది ఏం లేదని, నేను అన్ని ఫార్మెట్లు ఆడతానని పేర్కొన్నాడు‎. మరోవైపు తరుచుగా గాయాల పాలవుతుండటం, కోలుకొనేందుకు అధిక టైం పడుతుండటమే కారణమని పలువురు అంటున్నారు. మనదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ 20 సిరీసులో ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ లో నూ ఆడాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలిఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 217 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టీం నిలకడగా ఆడుతూ, భారత బౌలర్లకు పరీక్షగా మారారు. ఓపెనర్లు డేవాన్‌ కాన్వే (54; 153 బంతుల్లో), టామ్ లేథమ్‌ (30; 104 బంతుల్లో) వికెట్లు తీయడానికి టీమిండియా బౌలర్లు 34 ఓవర్లు వేయాల్సి వచ్చింది. దీంతో భువనేశ్వర్ ఉండి ఉంటే మ్యాచ్‌ లో భారత్ ఆధిపత్యం చెలాయించేదేనని అంటున్నారు ఫ్యాన్స్.

Also Read:

Best Fielders: మ్యాచ్‌లను మలుపు తిప్పిన ఆల్‌ టైం సూపర్ ఫీల్డర్స్‌..! వారెవరంటే..?

IND Vs NZ, WTC Final 2021 Day 4 Live: జోరుగా కురుస్తోన్న వర్షం.. ప్రారంభం కాని నాలుగో రోజు ఆట..