AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!

పని ఒత్తిడి, ఆర్ధిక భారం, ఇతరత్రా సమస్యలు.. ఇలా ప్రతీ రోజూ ఏదొక కారణం వల్ల మనిషి ఓ మిషన్‌లా పని చేస్తూనే ఉంటాడు. ఇలాంటప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే...

రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!
Ravi Kiran
|

Updated on: Jun 21, 2021 | 1:27 PM

Share

పని ఒత్తిడి, ఆర్ధిక భారం, ఇతరత్రా సమస్యలు.. ఇలా ప్రతీ రోజూ ఏదొక కారణం వల్ల మనిషి ఓ మిషన్‌లా పని చేస్తూనే ఉంటాడు. ఇలాంటప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే.. నిత్యం మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ఇదిలా ఉంటే కొంతమంది రాత్రి నిద్రపోయే ముందు స్నానం చేసిన తర్వాత భోజనం చేస్తారు. మరికొందరికి భోజనం చేసి స్నానం చేయడం అలవాటు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తిన్న వెంటనే స్నానం చేయొద్దని.. అలా చేసినట్లయితే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అసలు తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తిన్న తర్వాత స్నానం చేయడం చెడ్డదా.? లేక మంచిదా.?

తిన్న తర్వాత వెచ్చని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని.. ఆ ప్రభావం జీర్ణవ్యవస్థపై పడుతుందని డాక్టర్లు తెలిపారు. దాని ఫలితంగా వాంతులు, అల్సర్, అసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అలాగే వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల పల్స్ రేటు కూడా పెరుగుతుందని దీని వల్ల కడుపు తిమ్మిరి, నొప్పి వంటి సమస్యలు వస్తాయన్నారు.

తిన్న తర్వాత చల్లటి షవర్ బాత్ తీసుకోవచ్చా.?

తిన్న తర్వాత వెచ్చని నీటితో స్నానం చేయడం కంటే.. చల్లటి షవర్ బాత్ చేయొచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు. చల్లటి షవర్ బాత్ చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలలో ఎలాంటి మార్పులు రావని.. అంతేకాకుండా మీ జీర్ణక్రియ వ్యవస్థ స్రక్రమంగా ఉంటుందని అంటున్నారు. అలాగే మీరు తీసుకున్న ఆహారంలోని చెడు కొవ్వును కరిగిస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే తిన్న తర్వాత సుమారు 20 నిమిషాల అనంతరం స్నానం చేయడం ఉత్తమం అని డాక్టర్లు అన్నారు. కాగా, భోజనం అనంతరం 30 నిమిషాల వ్యవధి తీసుకుని బ్రష్ చేసుకోవాలని, స్విమ్మింగ్, వ్యాయామం లాంటివి చేయకూడదని చెప్పారు.

Also Read:

వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..

ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

Follow Us
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్