AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Shopping Cheating: ఈ కామర్స్ నిర్వాకం.. రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిస్తే.. పార్సిల్ తెరిచిన కస్టమర్ షాక్..!

ఆన్‌లైన్ షాపింగ్ విరివిగా పెరిగిపోయాయి. ప్రతిదీ ఇంట్లో నుంచే ఆర్డర్‌ చేసి తెప్పించుకోవల్సి వస్తుంది ఇదే క్రమంలో అర్డర్ ఇచ్చిన వస్తువులు ఒక‌దానికి బ‌దులు మ‌రొక‌టి రావ‌టం సాధార‌ణంగా మారిపోయాయి.

Online Shopping Cheating: ఈ కామర్స్ నిర్వాకం.. రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిస్తే.. పార్సిల్ తెరిచిన కస్టమర్ షాక్..!
Delhi Man Orders Remote Control Car From Online
Balaraju Goud
|

Updated on: Jun 22, 2021 | 10:38 AM

Share

Online Shopping Cheating: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్ షాపింగ్ విరివిగా పెరిగిపోయాయి. ప్రతిదీ ఇంట్లో నుంచే ఆర్డర్‌ చేసి తెప్పించుకోవల్సి వస్తుంది ఇదే క్రమంలో అర్డర్ ఇచ్చిన వస్తువులు ఒక‌దానికి బ‌దులు మ‌రొక‌టి రావ‌టం సాధార‌ణంగా మారిపోయాయి. వేలకు వేలు డబ్బులు పే చేశాక ఒక్కోసారి నకిలీ ఐటెమ్స్ డెలివరీ అవుతుంటాయి. ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు, రాళ్లు వచ్చిన వార్తలు కూడా విన్నాం. ఈ కామర్స్ లీలలు అంతా ఇంత కాదు. ఫేక్ డీలర్స్ నుంచి వస్తువులను ఎంపిక చేసుకుంటే అసలుకే మోసం వస్తోంది.

తాజా ఓ వ్యక్తి తన పిల్లాడి కోసం పిల్లల కోసం అమెజాన్ ఈ కామర్స్ ద్వారా రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిచ్చాడా వ్యక్తి. ఆ తర్వాత తనకు వచ్చిన డెలివరీ చూసి షాకయ్యాడు. వచ్చిన పార్సిల్ విప్పి చూడగ, దానిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇక్కడి భగవాన్ నగర్ ఆశ్రమ్ ప్రాంతానికి చెందిన విక్రమ్ బురాగోహైన్ అనే వ్యక్తికి ఎదురైందీ అనుభవం. దీన్ని అతను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో తెగ వైరలవుతోందీ పోస్ట్.

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో తాను రిమోట్ కంట్రోల్ కారు ఆర్డరిచ్చానని చెప్పిన విక్రమ్.. తనకు వచ్చిన ప్యాకేజీ చిన్నగా ఉండటంతో ఆశ్చర్యపోయాడట. ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మరో పెద్ద షాక్. దాంట్లో ‘పార్లే-జీ’ బిస్కెట్ ప్యాకెట్ ఉంది. అంటూ పేర్కొన్నాడు. ‘అమెజాన్‌లో మనం ఆర్డరిచ్చిన దానికి బదులు పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ వస్తే.. ఇక చాయ్ పెట్టుకోవాలి’’ అంటూ విక్రమ్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

దీన్ని చూసిన నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘పిల్లాడే కదా తీసుకునేది.. పార్లే-జీ పంపితే సరిపోతుంది అనుకున్నారేమో?’’ అని కొందరు అంటుంటే.. ఇక వెళ్లి చాయ్ పెట్టుకో అంటూ కొందరు సలహాలిస్తున్నారు. అయితే దీనిపై అమెజాన్‌కు ఫిర్యాదు చేశానని, వాళ్లు స్పందించారని విక్రమ్ తెలిపాడు. తను చెల్లించిన సొమ్మును రిఫండ్ చేసే ప్రక్రియ మొదలైందని వెల్లడించాడు.

Read Also….  Prashant Kishor: కొత్త ఫ్రంట్‌లతో బీజేపీ సర్కార్‌కు ప్రస్తుతం వచ్చే ముప్పు లేదు.. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు