Viral Video: వరుడిని భుజాలపై ఎత్తుకుని స్టెప్పులేసిన స్నేహితుడు.. క్షణాల్లో సీన్ రివర్స్.. ఫన్నీ వీడియో వైరల్!
పెళ్లి ఊరేగింపు అంటేనే కోలాహలంగా ఉంటుంది. ముఖ్యంగా స్నేహితులు చేసే సందడి అంతా ఇంతా కాదు. డీజే సాంగ్స్‌కు చిందులేస్తూ.. వరుడిని..
పెళ్లి ఊరేగింపు అంటేనే కోలాహలంగా ఉంటుంది. ముఖ్యంగా స్నేహితులు చేసే సందడి అంతా ఇంతా కాదు. డీజే సాంగ్స్‌కు చిందులేస్తూ.. వరుడిని సైతం స్టెప్స్‌లు వేయిస్తారు. ఇంకొందరు అయితే వరుడిని ఎత్తుకుని ఆటపట్టిస్తారు.. డ్యాన్స్‌లు కూడా చేస్తారు. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి ట్రై చేసి పూర్తిగా విఫలమయ్యాడు. వరుడిని భుజాలపైకి ఎత్తుకుని డ్యాన్స్ చేయాలని ప్రయత్నించిన అతడు.. బ్యాలెన్స్ చేయడంలో విఫలం కావడంతో.. వరుడు ఆ వ్యక్తి భుజాల మీద నుంచి అమాంతం రోడ్డు మీద పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!
పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. సరిగ్గా ఈ వీడియో కూడా అలాంటిదే. ఇందులో వరుడి స్నేహితుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. అతడి చేసిన పని నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. ఓ పెళ్లి ఊరేగింపులో వరుడిని అతడి స్నేహితుడు భుజాలపైకి ఎక్కించుకున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు. ఇద్దరూ కూడా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూ సాంగ్‌కి తగ్గట్టుగా చిందులు వేస్తున్నారు. అయితే వరుడి స్నేహితుడు.. భుజాలపై ఉన్న వరుడి కాళ్లను పట్టుకోకుండా.. చేతులు పైకి ఎత్తి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టడంతో.. బ్యాలెన్స్ తప్పింది. అంతే ఇంకేముంది భుజాలపై ఉన్న వరుడు కాస్తా నేరుగా నేలపైకి పడ్డాడు. దీనితో ఊరేగింపులోని కుటుంబసభ్యులు, స్నేహితులు వరుడిని పైకి లేపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అయ్యో.! పాపం వరుడి నడుము విరిగినట్లుందే” అంటూ నెటిజన్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ వీడియోకు 1.67 లక్షల వ్యూస్ వచ్చాయి. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి..!
Also Read: రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!