AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా ల్యాబ్‌ నుంచి బయటకొచ్చిన వయాగ్రా దోమలు..! వుహాన్‌ వృద్ధుల్లో కామోద్దీపన..!

Viagra injected Mosquitoes: వుహాన్‌ ల్యాబ్‌ పరిశోధకుల పరిశోధనలు బెడిసి కొట్టాయి. వయాగ్రా ఇంజెక్ట్‌ చేసిన వేల కొద్దీ దోమలు.. ల్యాబ్‌ నుంచి బయటపడ్డాయి. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్‌ నిర్వాహకులు ప్రకటించగా..

చైనా ల్యాబ్‌ నుంచి బయటకొచ్చిన వయాగ్రా దోమలు..! వుహాన్‌ వృద్ధుల్లో కామోద్దీపన..!
Mosquitoes Injected With Vi
Sanjay Kasula
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 22, 2021 | 1:16 PM

Share

Viral As Real News: ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు డ్రాగన్ కంట్రీపై దృష్టి పెట్టాయి. ఏ నిమిషంలో ఎలాంటి ఉపద్రవం సృష్టిస్తుందో అని ఆందోళనతో చూస్తున్నాయి. ఆకాశం నుంచి ఓ కన్నేసి ఉంచాయి. చైనాలో చీమ చిటుక్కుమన్నా అంతా ఉలిక్కిపడుతున్నాయి. తాజాగా ఓ పత్రిక ప్రచూరించిన వార్త అదే స్థాయిలో భయందోళనకు గురి చేసింది. వుహాన్‌ ల్యాబ్‌ పరిశోధకుల పరిశోధన బెడిసి కొట్టిందంటూ ప్రచూరించింది. వయాగ్రా ఇంజెక్ట్‌ చేసిన వేల కొద్దీ దోమలు .. అక్కడి ల్యాబ్‌ నుంచి బయటకొచ్చాయని ఆ వర్త సారాంశం. ఇదంతా ఓ పరిశోధకుడి నిర్లక్ష్యంతోనే జరిగిందని.. చివరికి ల్యాబ్‌ నిర్వాహకులు ప్రకటించినట్లుగా తెలిపింది.

బయటకొచ్చిన ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారని… లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారని ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుండడంతో  ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వార్త పూర్తిగా… “చైనా నుంచి మరో షాక్‌. వయాగ్రా దోమల ప్రభావంతో చైనాలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. పండు ముసళ్లోల్ల దగ్గరి నుంచి కుర్రాల దాకా కామ వాంఛతో రగిలిపోతున్నారు. వుహాన్‌కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికల్ని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడు. మరో పేషెంట్‌ నగ్నంగా ఆస్పత్రిలో తిరుగుతూ.. పబ్లిక్‌గా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి కనిపించిన వాళ్లపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇది వుహాన్‌ కెచ్‌లీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌. ఇక ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వుహాన్‌ ల్యాబ్‌ హెడ్‌ రీసెర్చర్‌ డాక్టర్‌ వెంజి యింగ్‌ యిన్‌ జింగ్‌ భయపడుతున్నారని వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌ సైట్‌ ఒక కథనాన్ని ప్రచురించింది.

Fact Check: ఇందులో ఎంత నిజం ఉందనే అంశంపై సోషల్ మీడియా ఫైక్ట్ చేసింది. వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్‌ డాట్‌ కామ్‌ అనేది కంప్లీట్‌ సెటైరికల్‌ వెబ్‌సైట్‌ అని తేల్చి చెప్పింది. ఇందులో ప్రచూరించే వార్తలు సత్యదూరంఅని పేర్కొంది. ‘‘నిజనిర్థారణలతో సంబంధం లేదు’’ అనేది ఆ వెబ్‌సైట్‌ క్యాప్షన్‌. అంతే కాదు ఈ వార్తలో ప్రచూరించిన ఫోటో కూడా నిజం కాదని తేల్చి చెప్పింది. ఈ వృద్దుడు జపాన్‌ వ్యాపారవేత్త యుకిషి చుగంజి నిర్ధారించింది. 2003లో 114 వయసులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఈ వృద్ధుడి రికార్డు ఆయన పేరు మీద ఉండేది.

ఇవి కూడా చదవండి : AP POLICE: ఏపీ పోలీసుల విజ్ఞప్తిని బేఖాతరు చేస్తున్న ట్విట్టర్.. నోటీసులు పంపేందుకు ప్లాన్ చేస్తున్న అధికారులు

 Vaccination Sunday: ఏపీలో ఇవాళ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్.. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకంగా వ్యాక్సిన్

CM KCR tour: ఇవాళ్టి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన.. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలకు శ్రీకారం

Biden Dog Dies: అమెరికా అధ్యక్షుడి పెంపుడు కుక్క మృతి.. ట్వీట్ చేసిన బైడెన్‌ దంపతులు..