AP POLICE: ఏపీ పోలీసుల విజ్ఞప్తిని బేఖాతరు చేస్తున్న ట్విట్టర్.. నోటీసులు పంపేందుకు ప్లాన్ చేస్తున్న అధికారులు

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jun 20, 2021 | 11:25 AM

ఏపీ డీజీపీ పేరిట నకిలీ ట్విటర్‌ ఖాతా కేసుకు సంబంధించి వివరాలివ్వాలని విజయవాడ పోలీసులు పంపిన మెయిల్‌ను ట్విటర్‌ బేఖాతరు చేసింది. ఇప్పటికి మూడుసార్లు...

AP POLICE: ఏపీ పోలీసుల విజ్ఞప్తిని బేఖాతరు చేస్తున్న ట్విట్టర్.. నోటీసులు పంపేందుకు ప్లాన్ చేస్తున్న అధికారులు
Ap Dgp Fake Twitter Account

కొత్త చట్టలు తీసుకొచ్చినా.. కేసులు నమోదవుతున్న తన మొండితనాన్ని వీడటం లేదు ట్విట్టర్ యాజమన్యం. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు కేసులు నమోదైనప్పటికీ.. ప్రభుత్వం అడిగిన సమాచారంను షేర్ చేయడానికి మొండికేస్తోంది. తాజాగా ఏపీ డీజీపీ పేరిట నకిలీ ట్విటర్‌ ఖాతా కేసుకు సంబంధించి వివరాలివ్వాలని విజయవాడ పోలీసులు పంపిన మెయిల్‌ను ట్విటర్‌ బేఖాతరు చేసింది. ఇప్పటికి మూడుసార్లు అధికారికంగా మెయిల్ పంపినప్పటికీ స్పందించడంలేదు. ఖాతాదారుల సమాచారాన్ని అందించలేమని నిరాకరించింది. అంతే కాదు తమకు ఖాతాదారుల వ్యక్తిగత భద్రత ముఖ్యంటోంది ట్విట్టర్.

గుర్తుతెలియని వ్యక్తులు డీజీపీ ఆంధ్రప్రదేశ్‌ అనే పేరుతో మూడు వారాల కిందట ట్విటర్‌లో నకిలీ ఖాతాను తెరిచారు. గౌతం సవాంగ్‌ ఫొటో కూడా ఆ ఖాతాకు జోడించారు. పోలీసులు దీన్ని ట్విటర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ఖాతాను మాత్రమే తొలగించారు. అంతేకానీ అడిగిన సమాచారం ఇచ్చేందుకు నో చెప్పింది. ఈ వ్యవహారంపై విజయవాడ సైబర్‌ పోలీసు స్టేషన్‌లో FIR నమోదయింది.

దర్యాప్తుకు సహకరించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీసుల మెయిల్ ద్వారా హెచ్చరించినా ట్విట్టర్ యాజమాన్యం స్పందించడం లేదు. కేసులు మరింత స్ట్రాంగ్‌ చేసేందుకు కేంద్రం ఇటివల తెచ్చిన ఐటీ చట్టాలను ఏపీ పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఎవరి ఐపీ చిరునామాతో ఆ నకిలీ ట్విటర్‌ ఖాతాను సృష్టించారు? దీని వెనుక ఎవరున్నారు? ఏదైనా కుట్ర దాగుందా? అన్న కోణాల్లో విచారణ మొదలు పెట్టారు. కేసు ముందుకు సాగాలంటే ఐపీ చిరునామాకు సంబంధించిన వివరాలు అవసరం. వీటి కోసం  పోలీసులు ట్విటర్‌ను మెయిల్‌ ద్వారా సంప్రదించారు. దర్యాప్తులో లాగ్స్‌ కీలకమని, ఇవ్వకపోతే  చట్టపరంగా ముందుకెళతామని మూడోసారి   హెచ్చరించినా సమాధానం రాలేదు.

ఐటీ చట్టం…

కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు ఇప్పటివరకు ఐటీ చట్టం కింద ఇస్తున్న మినహాయింపులను ఇటీవల తొలగించింది. దీనివల్ల ట్విటర్‌లోని అన్ని అంశాలకు సంస్థ బాధ్యత వహించడమే కాదు.. చట్టపరంగా కేసులనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం దర్యాప్తులో భాగంగా ఏదైనా సమాచారం అడిగితే ఇవ్వాలి. ఇప్పటికే దేశంలో పలుచోట్ల వివిధ కేసులకు సంబంధించి పోలీసులు ట్విటర్‌కు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు కూడా సమాచారాన్ని రాబట్టుకునేందుకు ట్విటర్‌ అధికారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి : Vaccination Sunday: ఏపీలో ఇవాళ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్.. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకంగా వ్యాక్సిన్

CM KCR tour: ఇవాళ్టి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన.. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలకు శ్రీకారం

Biden Dog Dies: అమెరికా అధ్యక్షుడి పెంపుడు కుక్క మృతి.. ట్వీట్ చేసిన బైడెన్‌ దంపతులు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu