Vaccination Sunday: ఏపీలో ఇవాళ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్.. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకంగా వ్యాక్సిన్
Vaccination Special Drive: కోవిడ్ రక్కసి కట్టడికి ఏపీ సర్కార్ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదే క్రమంలో ఆదివారం ఒకేరోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని ప్లాన్ చేసింది.
కోవిడ్ రక్కసి కట్టడికి ఏపీ సర్కార్ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదే క్రమంలో ఆదివారం ఒకేరోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తిచేసింది. కోవిడ్ విజృంభించిన సమయంలో ఆక్సిజన్ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టిన సర్కార్ … ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది. వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ఏపీ పభుత్వం ఆదివారం నిర్వహించనుంది. రేపు ఒక్కరేజే 8 లక్షల కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసేలా లక్ష్యం పెట్టుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్ల కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఒక్కరోజులోనే 6 లక్షల వ్యాక్సిన్లు వేసి ఏపీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు కోటి 22లక్షల 83వేల 479 వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం ప్రజలకు అందించింది. ఇప్పటివరకు 5లక్షల 29వేల మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు తొలి డోస్ వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు ఒక్కరోజులో 6 లక్షల కరోనా వాక్సిన్ డోస్‌లను వైద్య ఆరోగ్యశాఖ అందించింది. ఇప్పటివరకు 26,41,739 మందికి ప్రభుత్వం రెండు డోసుల టీకాను వేసింది.
ఆదివారం మెగా డ్రైవ్ చేపడుతున్నట్లుగా కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని.. 8 లక్షల నుంచి 10 లక్షల మంది వరకూ వ్యాక్సిన్ వేయాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు.