AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayurveda-Turmiric Benefits: సర్వ గుణ సంపన్న ఔషధం పసుపు యొక్క అద్భుతమైన ఆయుర్వేద గుణాలు

Ayurveda-Turmiric Benefits: భారతీయుల వంటల్లో వాడే అతిముఖ్యమైన పదార్ధం పసుపు. సర్వగుణ సంపన్నమైన పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ,...

Ayurveda-Turmiric Benefits: సర్వ గుణ సంపన్న ఔషధం పసుపు యొక్క అద్భుతమైన ఆయుర్వేద గుణాలు
Turmeric
Surya Kala
|

Updated on: Jun 19, 2021 | 11:19 AM

Share

Ayurveda-Turmiric Benefits: భారతీయుల వంటల్లో వాడే అతిముఖ్యమైన పదార్ధం పసుపు. సర్వగుణ సంపన్నమైన పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, మరియు యాంటి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. దీంతో ఇది ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడుతుంది. ఇది క్యాన్సర్ కణాల విస్తరణను కూడా నిరోధిస్తుంది. ఆయుర్వేదంలో పసుపు యొక్క ప్రాధాన్యత .. ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం

* పసుపులో ఉండే అతి ముఖ్యమైన బయోయాక్టివ్ సమ్మేళనం కర్కుమిన్. అందుకనే పసుపును ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగా ఉపయోగిస్తారు. *పసుపులోని కర్కుమిన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలదు. ఇది కాలేయాన్ని కాపాడుతుంది మరియు గట్టిపడకుండా చేస్తుంది. కాలేయ వ్యాధులకు అద్భుత చికిత్సగా పనిచేస్తుంది. *పసుపు షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. మధుమేహ వ్యాధి గ్రస్తుల చికిత్సకు సహాయపడుతుంది. *పసుపులో ఉండే కర్కుమిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడమే కాదు.. రక్తంలో అధిక కొవ్వు స్థాయిని నియంత్రిస్తుంది. *పసుపు బీటా కణాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బీటా కణాలు ఇన్సులిన్‌ను తయారు చేస్తాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే హార్మోన్. * రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. *కోలన్ (పెద్దప్రేగు) క్యాన్సర్, కడుపు క్యాన్సర్ మరియు చర్మపు క్యాన్సర్ల బారి నుంచి పసుపు కాపాడుతుంది. *పసుపు కెమోథెరపీని మరింత ప్రభావవంతం చేసి ఆరోగ్యకరమైన కణాలను రక్షిస్తుంది. * పసుపులోని కర్కుమిన్ క్యాన్సర్ కణాల నాశనానికి కూడా తోడ్పడుతుంది. * ప్రోస్టేట్, ఊపిరితిత్తులు మరియు క్లోమం వంటి వాటితో సహా క్యాన్సర్ కణాలను చంపడంలోనూ, ఆరోగ్యకరమైన వాటిని రక్షించడంలోనూ ఇది చక్కని పాత్ర పోషిస్తుంది *ఊబకాయాన్ని తగ్గించడానికి.. కొవ్వును కరిగించే ప్రక్రియను పెంచుతుంది. *జీవక్రియను మెరుగుపరుస్తుంది. *పసుపు దీర్ఘకాలిక గాయాలను నయం చేస్తుంది. *పసుపులోని కర్కుమిన్ గుండె జబ్బులను నివారిస్తుంది. *అల్జీమర్స్ వ్యాధి ఉన్న రోగులలో మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. *వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే దగ్గు, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. *మహిళల్లో నెలసరి రోజులలో కలిగే నొప్పికి పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పనిచేస్తాయి. *పసుపు రుమటాయిడ్ మరియు ఆర్థరైటిస్ ఉన్నవారిలో రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. *పసుపులోని కర్కుమిన్ ఉబ్బసాన్ని కూడా తగ్గిస్తుంది. *పసుపు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సోరియాసిస్ మరియు తామర చికిత్సకు సహాయపడతాయి. *పసుపులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పాదాల పగుళ్ళను తగ్గించడానికి సహాయపడతాయి. *పసుపు చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడానికి చర్మం కాంతివంతంగా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

పసుపు లో ఇంకా అనేక అద్భుత గుణాలు కలిగి ఉన్నాయి. ఆయుర్వేదంలో సర్వ గుణ సంపన్న ఔషదమైనప్పటికీ పసుపుని మోతాదుకి మించి వాడకూడదు.

Also Read:  వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు..