Petrol Diesel Price: వాహనదారులకు చుక్కలు.. భారీగా పెరిగిన ఇంధన ధరలు
Petrol Diesel Price: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యల జేబులకు చిల్లు పెడుతోంది. రూ.100 దాటిన పెట్రోల్ ధర మరింత పెరుగుతూ వాహనదాలుకు చుక్కులు చూస్తోంది.
Petrol-Diesel Rates Today: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యల జేబులకు చిల్లు పెడుతోంది. రూ.100 దాటిన పెట్రోల్ ధర మరింత పెరుగుతూ వాహనదాలుకు చుక్కులు చూస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రవాణ ఖర్చులపై పడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టి ముందుకు వెళ్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. ఆదివారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.04గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 95.89గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.18 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.01గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 100.82గా ఉండగా.. డీజిల్ ధర రూ. 96.62గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.43గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.26గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.26ఉండగా.. డీజిల్ ధర రూ.96.10 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.58 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.46గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 103.65 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 97.88 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 102.89 ఉండగా.. డీజిల్ ధర రూ.97.14గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.97లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.20 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.26 గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.52గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 103.65 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.97.88 లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 97.22గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.97 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.36కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.44 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.97.12 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 90.82 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.40ఉండగా.. డీజిల్ ధర రూ.92.58గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.47 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.93.26గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.60 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.54గా ఉంది.