Actress Chandini Case : సినీ నటి కేసులో మాజీ మంత్రి అరెస్ట్..! పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఆరోపణలు..
Actress Chandini Case : తమిళ నటి చాందిని కేసులో అన్నా DMK మాజీ మంత్రి మణింకందన్ బెంగుళూరులో అరెస్టు అయ్యాడు.
Actress Chandini Case : తమిళ నటి చాందిని కేసులో అన్నా DMK మాజీ మంత్రి మణింకందన్ బెంగుళూరులో అరెస్టు అయ్యాడు. చాందిని ఇచ్చిన ఫిర్యాదుతో కొన్నిరోజులుగా మణికందన్ పరారీలో ఉన్నాడు. అయితే బెంగళూరులో ఉన్నాడన్న సమాచారం మేరకు తమిళనాడు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సినీ నటి చాందిని ని పెళ్ళిచేసుంటానని చెప్పి మణికందన్ ఐదు సంవత్సరాలు ప్రేమ వ్యవహారం నడిపించిన సంగతి అందరికి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది.
ఈ కేసు విషయంలో తనకు మణికందన్ మూడుసార్లు అబార్షన్ చేయించాడని చాందిని ఆరోపిస్తుంది. అతడి స్నేహితుడైన ఓ డాక్టర్ సహాయంతో అబార్షన్ చేయించాడని చెబుతుంది. అంతేకాకుండా రహస్యంగా తీసిన నా అంతరంగ ఫొటోలను టెలిగ్రాం ద్వారా పంపి బెదిరింపులకు దిగాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి మణికంఠ తనతో దిగిన చిత్రాలను నటి చాందిని బయట పెట్టింది. తన జీవితాన్ని నాశనం చేసిన మంత్రి మణికందన్ బెదిరింపులకు బయపడేది లేదు అంటూ ఘాటుగా హీరోయిన్ చాందిని సమాధానం ఇచ్చింది. వారిద్దరికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసింది. ఇదిలావుంటే, మణికందన్ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. టీటీవీ దినకరన్ గ్రూపులో చేరిన రెబెల్‌గా ఆయన గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యతిరేక కూటమిలో చేరడం వల్ల ఆయన మంత్రి పదవిని కోల్పోయారు.