AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder Explosion : ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో గ్యాస్ పేలుడు.. 13 మందికి తీవ్ర గాయాలు

Gas Cylinder Explosion : ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ ఇంటి వద్ద గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది.

Gas Cylinder Explosion :  ఢిల్లీలోని  మంగోల్‌పురి ప్రాంతంలో గ్యాస్ పేలుడు.. 13 మందికి తీవ్ర గాయాలు
Gas Cylinder Explosion
uppula Raju
|

Updated on: Jun 20, 2021 | 9:01 AM

Share

Gas Cylinder Explosion : ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ ఇంటి వద్ద గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. వెంటనే మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. గంటల వ్యవధిలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. అయితే గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ సంఘటన జరిగిందని ఆయన ధృవీకరించారు. కాగా ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం మాత్రం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది వివరించారు. ఈ ప్రమాదంలో ఇంకా ఆస్తినష్టం ఎంత జరిగిందో తెలియరాలేదన్నారు.

PPF Account : పీపీఎఫ్ ఖాతాతో ఎన్నో ప్రయోజనాలు..! పన్ను మినహాయింపుతో పాటు అధిక వడ్డీ.. ఇంకా మరెన్నో..

National Career Service Portal : ప్రైవేట్ జాబ్ కోసం వెతుకుతున్నారా..! అయితే అన్ని వివరాలు ఇక్కడ లభిస్తాయి..

Benefits Of Yoga: మనం మరచిన యోగాను అడాప్ట్ చేసుకున్న విదేశీయులు.. యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం అంటున్న నిపుణులు

Horoscope Weekly: వార ఫలాలు.. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటు ఉండదు.. శుభవార్తలు వింటారు..!