Benefits Of Yoga: మనం మరచిన యోగాను అడాప్ట్ చేసుకున్న విదేశీయులు.. యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం అంటున్న నిపుణులు

Yoga Day: యోగాకు భారత దేశం పుట్టినిల్లు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే యోగాను దేశవిదేశాలవారు ఆచరిస్తున్నారు. అయితే మనదేశంలో మాత్రం కొంత కాల నిర్లక్ష్యానికి..

Benefits Of Yoga: మనం మరచిన యోగాను అడాప్ట్ చేసుకున్న విదేశీయులు.. యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం అంటున్న నిపుణులు
Yoga Day
Follow us
Surya Kala

|

Updated on: Jun 20, 2021 | 7:59 AM

Benefits Of Yoga: యోగాకు భారత దేశం పుట్టినిల్లు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే యోగాను దేశవిదేశాలవారు ఆచరిస్తున్నారు. అయితే మనదేశంలో మాత్రం కొంత కాల నిర్లక్ష్యానికి గురైంది. మళ్ళీ దీనిపై గత కొంతకాలంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కోసం యోగా ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడిప్పుడే యోగాసనాలనుఅభ్యసించేవారు పెరుగుతున్నారు. యోగా లాభాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేపు ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం.

వారంలో ఒక్క గంటైనా యోగా చేస్తే మానసికగా బలంగా ఉంటామని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు.. యోగా ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి వెల్లడించారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న 30 మందిపై అధ్యయనం చేసి తాము ఈ విషయాని చెబుతున్నామని అన్నారు. మొదటి గ్రూపు వారిని వారానికి 3సార్లు, రెండో గ్రూపు వారిని వారానికి 2సార్లు చొప్పున మూడు నెలల పాటు యోగా చేయించారు. యోగా మొదటిపెట్టిన తొలిరోజు, చివరిరోజున వారి మెదళ్లను ఎంఆర్ఐ స్కాన్ చేశారు.

యోగా వల్ల మానసిక కుంగుబాటు పూర్తిగా తగ్గిందని నిపుణులు నిర్ధారించారు. వారానికి గంటపాటు యోగా చేయడం వల్లే ఇలా సాధ్యమైందని తేల్చారు. భారతీయుల ఆధ్యాత్మికలో యోగాసనాలు ఒక భాగం. మునులు ఋషులు సూర్య నమస్కరాలు . పద్మాసనం వంటి యోగాసనాలను రోజు అభ్యసించేవారు. అయితే కాలంతో పాటు ఆధునికత పేరుతొ పెడుతున్న పరుగులో మన పూర్వీకులు మనకు అందించినవి ఎన్నో మరుగున పడిపోయాయి.. అందులో ఒకటి . అయితే ఈ యోగాను ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలు సైతం అడాప్ట్ చేసుకున్నాయి.

మానసిక ఆరోగ్యం కోసం శారీరక దృఢత్వం కోసం యోగాసనాలను అభ్యసించడం మొదలు పెట్టాయి. మనం వారిని చూసి ఇప్పుడు మళ్ళీ యోగా బాట పట్టమని చెప్పవచ్చు. దీంతో ఇటీవల యోగాకు మళ్లీ ప్రాముఖ్యత పెరగింది. ప్రపంచం కూడా యోగా లాభాలను గుర్తించింది. అనేక యోగాసనాలు.. శరీరంలోని రుగ్మతలను పోగొట్టే లక్షణాలు కలిగి ఉన్నాయని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. రోజూ కనీసం ఒక 15 నిమిషాలు యోగా చేద్దాం.. లేదా వారంలో ఒక గంట యోగాను చేద్దాం.. ఆరోగ్యంగా జీవిద్దాం అంటూ యోగా దినోత్సవం సందర్భంగా పిలుపునినిచ్చారు యోగా సాధన నిపుణులు

Also Read: సైకిల్ మీద ఫుడ్ డెలివరీ ఇస్తున్న బాయ్ కు అండగా నిలిచిన ఫేస్ బుక్ పేజీ సభ్యులు.. మోటార్ సైకిల్ అందజేత ఎక్కడంటే