Horoscope Weekly: వార ఫలాలు.. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటు ఉండదు.. శుభవార్తలు వింటారు..!

Horoscope Weekly: 20 to 26 June 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను..

Horoscope Weekly: వార ఫలాలు.. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటు ఉండదు.. శుభవార్తలు వింటారు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 20, 2021 | 7:56 AM

Horoscope Weekly: 20 to 26 June 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ వారంలో రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి

ఉద్యోగానికి సంబంధించి దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగ్గా ఉంటాయి. కుటుంబం విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్య పరిష్కారం అవకాశాలుంటాయి. ఈ రాశివారు ప్రారంభించే కొన్ని పనులు స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు.

వృషభ రాశి

వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటు ఉండదు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందినవారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. ఎవరికి పడితే వారికి హామీలు ఇవ్వవద్దు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలుగా మెదులుకోవడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

మిథున రాశి

ఈ రాశివారికి ఈ వారంలో వ్యాపారాల్లో ఒత్తిడిలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో కాస్త జాగ్రత్తలు వహించడం మంచిది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుంచి సహాయం అందుకుంటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి

ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యేగాలు వచ్చే అవకాశాలుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దీంతో మానసికంగా కొంత ఇబ్బందులకు గురవుతుంటారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి.

సింహ రాశి

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరిగిన కొద్ది ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ముఖ్యమైన పనులు చేపడతారు. ఈ రాశివారికి ఈ వారంలో వ్యాపారుల ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. వీలైనంతగా రుణ భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఒక శుభ కార్యం సందర్భంగా బంధువులను కలుసుకునే అవకాశం ఉంది.

కన్య రాశి

ఉద్యోగంలో మంచి హోదా లభించే అవకాశం ఉంది. ఈ రాశివారు వ్యాపారాలలో మరింత ముందుకు సాగుతారు. లాభాలు వస్తాయి. కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయంగా ఉంటారు. ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు.

తుల రాశి

ఈ రాశివారికి ఈ వారంలో అనుకున్న పనులు అనుకున్నట్లు జరగకపోవచ్చు. అనుకోని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. కుటుంబపరంగా బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఖర్చులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది. ఇరుగుపొరుగుతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

వృశ్చిక రాశి

ఆనుకోని విధంగా ఆర్థిక సాయం అందుతుంది. వ్యాపారాలలో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగులు, ఉపాధి వారికి, ఇతరులకు ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. ఉద్యోగంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం వేచి చూడక తప్పదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.

ధనస్సు రాశి

ఉద్యోగంలో అందరి ప్రశంసలు పొందుతారు. వ్యక్తిగత సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థికంగా ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. పిల్లలు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తుంటారు.

మకర రాశి

ఈ రాశివారికి ఈ వారంలో ఇంటా బయట ఒత్తిడిలు పెరుగుతాయి. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. స్నేహితుల వల్ల కొంత మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టే పనులను పూర్తి చేస్తారు. బంధువుల ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు.

కుంభ రాశి

ఉద్యోగం మారేందుకు మీరు చేసే పనులు కొంత బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఈ వారంలో అటువంటి ప్రయత్నాలు విరమించుకోవడం మంచిది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో త్వరలో స్థిరత్వం లభిస్తుంది. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

మీన రాశి

ఈ రాశివారికి ఈ వారంలో ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరి కొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. కొందరు మిత్రులను నమ్మి నష్టపోతారు. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

ఇవీ కూడా చదవండి

Telangana Ashada Bonalu: వచ్చే నెల 25,26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. ప్రభుత్వ నిబంధనల మేరకే బోనాల జాతర

Tirumala : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఇక మరో రెండు భాషల్లో.. కొత్తగా 16 టీటీడీ కళ్యాణ మండపాలు : టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి