Horoscope Today: ఈరాశుల వారికి నూతన ఉద్యోగావకాశాలు ఉంటాయి.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today 21st June 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
Horoscope Today 21st June 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 21న) సోమవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులలో ఏమాత్రం తొందరపడకూడదు. పెద్దవారి సలహాలు తీసుకోవడం మంచిది. మహాలక్ష్మీ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృషభ రాశి.. ఈరోజు వీరు నూతన ఉద్యోగ లాభాలు కలిసి వస్తుంటాయి. కొన్ని కొత్త విషయాలు అందుబాటులో ఉంటాయి. పేద విద్యార్థుల చదువుల కోసం సహకరించే ప్రయత్నం చేయండి.
మిథున రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు.. ప్రయాణ పరంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. పరమేశ్వరుని అభిషేకం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి.. ఈరోజు వీరికి రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతుంటాయి. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గోంటుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
సింహరాశి.. ఈరోజు వీరు క్రయ, విక్రయ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. రావాల్సిన బాకీలు కొంత ఆలస్యం అవుతుంటాయి. ముందుచూపుతో వ్యవహరిస్తుండాలి. సంకటనాష గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కన్య రాశి.. ఈరోజు వీరు వ్యవహరిక విషయంలో ముందు చూపుతో వ్యవహరించడం మంచిది. వ్యాపార రంగంలో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మహా గౌరీ అమ్మవారి దర్శనం, కుంకుమార్చన మేలు చేస్తుంది.
తులారాశి.. ఈరోజు వీరు విలువైన వస్తువులను సేకరించుకుంటారు. వ్యాపార వ్యవహరిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు కొనసాగుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. పేదవారికి అన్నదానం చేసుకోవడం మంచిది.
ధనుస్సు రాశి.. ఈరోజు వీరికి కొన్ని వేరు వేరు ఒప్పందాలలో కుదుర్చుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శివాలయ దర్శనం మేలు చేస్తుంది.
మకర రాశి.. ఈరోజు వీరి కార్యక్రమాలు కొంత అనుకూలంగా ఉంటాయి. పెద్దవారి సలహాలు తీసుకోవడం మంచిది. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభరాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు సంఘంలో కొన్ని రకాల ప్రయోజనాలు కలుగజేస్తాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడడం మంచిది కాదు. లలితా సహస్త్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
మీన రాశి.. ఈరోజు వీరికి కుటుంబంలో కలహాలు కలుగజేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశపరచకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సుదర్శన స్వామి వారి అర్చన మేలు చేస్తుంది.