AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pritilata : భారతీయులను కుక్కలతో పోల్చిన బ్రిటిష్ వారిని వణికించిన వీరనారి జీవితం.. చరిత్ర చెప్పని పాఠం

Pritilata Waddedar: భారతదేశం వీరులకు పుట్టినిల్లు బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తి కోసం ఎందరో వీరులు తమ జీవితాలను .. తమ ప్రాణాలను తృణప్రాయముగా...

Pritilata : భారతీయులను కుక్కలతో పోల్చిన బ్రిటిష్ వారిని వణికించిన వీరనారి జీవితం.. చరిత్ర చెప్పని పాఠం
Pritilatha
Surya Kala
|

Updated on: Jun 20, 2021 | 8:43 AM

Share

Pritilata Waddedar: భారతదేశం వీరులకు పుట్టినిల్లు బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తి కోసం ఎందరో వీరులు తమ జీవితాలను .. తమ ప్రాణాలను తృణప్రాయముగా త్యజించారు. మనదేశానికి వ్యాపారం కోసం వచ్చి.. మనలోకి అనైక్యతతో దేశాన్ని ఎలా రాజులయ్యారు.. చివరకు భారతీయులను బానిసలుగా భావించి పాలించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఎందరో వీరులు, వీరమాతలు దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి దేశ విముక్తి కోసం పోరాడారు.. చిన్న వయసులోనే మరణించారు. అయితే దేశం కోసం పోరాడిన ఎందరో వీరులు చరిత్ర మాటున దాగి ఉన్నారు.. అలాంటి వీరుల త్యాగాలను భావితరాలకు అందించడానికి టీవీ9 ప్రయత్నిస్తోంది. ఈరోజు భారతీయులను కుక్కలతో పోల్చిన బ్రటిష్ వారిని వణికించిన వీరనారి గురించి తెలుసుకుందాం..

బ్రిటిష్ పాలకులకు భారతీయులంటే చులకన.. తాము తెల్లవారిమానే అహంకారం తో భారతీయులను బానిసలుగా భావించేవారు.. వారి అహంకారానికి పరాకాష్టగా నిలచింది.. ఓ సంఘటన 1932 లో భారతీయులకు, కుక్కలకు ఇక్కడ ప్రవేశం లేదు అని..చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటిష్ క్లబ్ ముందు బోర్డ్ కట్టారు. ఆ బోర్డుని .. బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గాన్ని చూసి ..ఓ అమ్మాయి మనసు రగిలింది. భారతీయులంటే ఇంత చులకనా అనే భావం అంటూ.. గుండెలో ఆగ్రహం ఉప్పొంగింది.ఎలాగైనా బ్రిటిష్ వారు పెట్టిన పెట్టిన బోర్డును పగలగొట్టాలని.. తెల్లవారికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఆమె పేరు ప్రీతిలత. కలకత్తా యూనివర్సిటీలో బి.ఏ.ఫస్ట్ క్లాసులో పాస్ అయిన మేధావి. టీచర్ గా జాబ్ చేస్తున్న ఓ వీరమహిళ.

ప్రేమలత దాడి జరిగిన రోజున,పంజాబీ మగవాడిగా వేషం మార్చుకుంది. స్వరాజ్యవీరుడు సూర్యసేన్ సహకారంతో..1932సెప్టెంబర్ 24 రాత్రి 10-45నిముషాలకు..బ్రిటిష్ క్లబ్ పైన దాడి చేసింది.ఒక్క దెబ్బకే బోర్డ్ బద్దలయ్యింది. క్లబ్ లోకి ధైర్యంగా అడుగుపెట్టి ..కాల్చడం మొదలు పెట్టారు ప్రీతిలత బృందం.యువ వీరుల్ని చూసి భయంతో గజగజ లాడారు బ్రిటిష్ అధికారులు.అప్పటికే చాలా మంది గాయపడ్డారు.ఇంతలో..ఒక మూలనుండి ప్రీతిలతని గురి చూసి కాల్చాడు ఓ తెల్లవాడు. బులెట్..ప్రీతిలత భుజంలోకి దూసుకు పోయింది.రక్తం ధార కట్టింది.ఆ చేతిని అలాగే నొక్కి పెట్టి..ప్రీతిలత ముందుకు సాగింది.ఆమె ధైర్యానికి బ్రిటీష్ అధికారులు వణికిపోయారు. క్రమంగా బులెట్ గాయంనుండి రక్తస్రావం ఎక్కువయ్యింది. అయితే పోరాటంలో ఆంగ్లేయులకు లొంగిపోవలసిన సమయం వచ్చింది. అది ఇష్టంలేని ప్రేమ లత తనతో తెచ్చుకొన్న సైనేట్ మింగి ఆత్మహత్య చేసుకుంది. భరతమాతకూ జై అంటూ.. ప్రాణాలు విడిచింది.ప్రీతిలతకు అప్పటికి కేవలం ఇరవై ఒక్కేళ్ల వయసు మాత్రమే. ఆ తర్వాత భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే అటువంటి బోర్డులు మరెక్కడా పెట్టే ధైర్యం చేయలేకపోయారు తెల్లవాళ్ళు.

చిట్టగాంగ్ తిరుగుబాటు కథతో 2010 బాలీవుడ్ లో ఖలీన్ హమ్ జీ జాన్ సే సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో విశాఖా సింగ్ ప్రీతిలత పాత్రను పోషించారు. మళ్ళీ 2012 లో చిట్టగాంగ్ తిరుగుబాటు ఆధారంగా హిందీ చిత్రం చిట్టగాంగ్ విడుదలైంది. వేగా తమోటియా ప్రీతిలత వాడ్డేదార్ పాత్రను పోషించింది.

Also Read: మనం మరచిన యోగాను అడాప్ట్ చేసుకున్న విదేశీయులు.. యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం అంటున్న నిపుణులు