India Corona Cases: ఇండియా కరోనా బులిటెన్.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా తీవ్రత
India Corona Cases: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 81 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయిలు పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 81 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయిలు పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,419 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,81,965కి చేరింది. ఇందులో 7,29,243 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం కొత్తగా 88,997 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,87,66,009కు చేరింది. అటు నిన్న 1,576 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,86,713కి చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 27,66,93,572 మందికి వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 96.27 శాతంగా ఉందని తెలిపింది.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/v03wtk45FN
— ICMR (@ICMRDELHI) June 20, 2021