National Kissing Day: అమెరికాలో కిస్సింగ్ డే ఈరోజు.. ఎందుకు పండుగలా జరుపుకుంటారంటే..

National Kissing Day: కిస్ ఈజ్ కీ ఆఫ్ లవ్.. లవ్ ఈజ్ లాకర్ ఆఫ్ లైఫ్ .. అవును జీవితంలో ముద్దుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అమ్మ ప్రేమతో పిల్లలకు...

National Kissing Day: అమెరికాలో కిస్సింగ్ డే ఈరోజు.. ఎందుకు పండుగలా జరుపుకుంటారంటే..
Kssing Day
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2021 | 4:13 PM

National Kissing Day: కిస్ ఈజ్ కీ ఆఫ్ లవ్.. లవ్ ఈజ్ లాకర్ ఆఫ్ లైఫ్ .. అవును జీవితంలో ముద్దుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అమ్మ ప్రేమతో పిల్లలకు పెట్టె ముద్దు నుంచి ప్రేమికులు పెట్టుకునే ముద్దు వరకూ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ కిస్సింగ్ డేస్ లో నేషనల్ వేరు.. ఇంటర్నేషనల్ వేరు.. ప్రపంచ కిస్సిండ్ డే వేరు వేరు తేదీల్లో జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఏటా అగ్రరాజ్యం అమెరికాలో ముద్దుల పండగను జూన్ 22న జరుపుకుంటారు.

ఈ జాతీయ ముద్దు దినోత్సవం రోజున లవర్స్ ఘాడంగా ముద్దు పెట్టుకోవాలని.. దీంతో ప్రేమికుల మధ్య బంధం బలపడుతుందని.. పెళ్లి తర్వాత వీరి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని.. అమెరికా ఆంత్రోపాలజిస్టులు సూచిస్తున్నారు. అందుకనే ప్రేమికులు ముద్దుని ఇష్టంగా పెట్టుకోవాలని చెబుతున్నారు. కాలానుగుణంగా ముద్దుల్లో మార్పులు వచ్చినా దీనిపై అధ్యయనం 19వ శతాబ్దం మొదలైంది. దీన్ని ఫిలెమాటోలజీ అంటారు

ఈ ముద్దుల విషయంలో కూడా అనేక వాదనలున్నాయి. రోమన్ కాలం నుంచి వాడుకలో ఈ ముద్దులు ఉన్నాయని కొంతమంది చరిత్ర కారులు చెబుతుంటే.. మరికొందరు మొట్టమొదట క్రీస్తు పూర్వం 326లో ది గ్రేట్ అలెగ్జాండర్ నుంచి ఉన్నాయని అంటున్నారు. ఇంకొందరు క్రీస్తు పూర్వం 1500 కాలం నుంచి ఉందని.. కాలక్రమంలో ముద్దుల్లో మార్పులు వస్తున్నాయని చెబుతున్నారు. కొంతమంది చరిత్ర పరిశోధకులు ఐతే.. ఈ ముద్దులు భారత్ లో మొదట ఉన్నయని అక్కడ నుంచే ప్రపంచ దేశాలకు పాకాయని.. ఈ ముద్దుల గురించి వేదాల్లో సాహిత్యం లో ప్రస్తావన ఉందని అంటున్నారు. ఇదే విషయాన్ని నేషనల్ టుడే డాట్ కామ్ ప్రస్తావించింది. చాలా దేశాల్లో ఈ కిస్సింగ్ డేను డిఫరెంట్ తేదీల్లో జరుపుకుంటున్నా .. అనేక వివాదాలు కూడా ఉన్నాయి. కొంతమంది మత పెద్దలు ఏ ఈ బహిరంగ ముద్దుల కార్యక్రమం పై నిరసన తెలియజేస్తూ ఉంటారు.

Also Read: అది నిజమైతే మీకే ముందు స్వీట్స్ ఇస్తా .. గర్భవతి వార్తలపై స్పందించిన పూనమ్ పాండే