మహిళల వస్త్రధారణపై పాక్ ప్రధాని ఇమ్రాన్ చెత్త కామెంట్:PM Imran Khan
అధికారంలో ఉన్నవారు, ముఖ్యంగా పెద పదవిలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.. ఇప్పటికే మహిళల వస్త్రధారణపై మగానుభావులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశారు.. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆ జాబితాలో చేరారు..
అధికారంలో ఉన్నవారు, ముఖ్యంగా పెద పదవిలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.. ఇప్పటికే మహిళల వస్త్రధారణపై మగానుభావులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశారు.. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆ జాబితాలో చేరారు..మహిళలు ధరించే వస్త్రాల కారణంగానే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయనే ఓ వివాదాస్పదమైన మాట అనేశారు.. ఇలాంటి మాటను ఇక్కడ కూడా చాలా మంది అన్నారు.. ఇక్కడే కాదు.. ప్రపంచంలో ఉన్న మగవాళ్లందరూ దాదాపుగా ఇలాగే ఆలోచిస్తారేమో! మహిళలు తమ వస్త్రధారణతో మగవారి మనసు చెదిరేలా చేస్తున్నారని, అందుకే అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయని ఇమ్రాన్‌ఖాన్ చెప్పుకొచ్చారు. మహిళలు కురచ దుస్తులు ధరిస్తే మగవాళ్ల మనసు చలిస్తుందట! తమ శరీరం కనిపించేలా దుస్తులు ధరిస్తే ఎవరు మాత్రం చలించకుండా ఉండరంటూ ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఇమ్రాన్ కామెంట్ చేసి పారేశారు. రోబోల్లాంటి పురుషులే చలించకుండా ఉండగలరని కూడా చెప్పారు. మనం నివసిస్తున్న సమాజం పూర్తిగా భిన్నమైనదని, ఇక్కడ ఎలా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం మనకే ఉండాలని సుద్దులు చెప్పుకొచ్చారు ఒకప్పటి ప్లేబాయ్!
అనుకున్నట్టుగానే ఇమ్రాన్ వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు కూడా మండిపడుతున్నారు. పాకిస్తాన్‌లో పెరిగిపోతున్న అఘాయిత్యాలతో మహిళల వస్త్రధారణను ముడిపెట్టడం దారుణమని ఇంటర్నేష:నల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ లీగల్ అడ్వైజర్ రీమా ఒమర్ అన్నారు. ఇమ్రాన్ ప్రేలాపనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో ఆయన సోషల్ మీడియా తప్పును సరిదిద్దే పనిలో పడింది. ఇమ్రాన్ వ్యాఖ్యలను వక్రీకరించారని సోషల్ మీడియా వ్యవహారాలు చేసే అధికార ప్రతినిధి డాక్టర్ అర్ స్లాన్ ఖాలిద్ చెప్పుకొచ్చారు. ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా చెప్పకుండా ఆయన ప్రసంగంలోంచి ఒక్క వాక్యాన్ని మాత్రమే కట్ చేసి రాద్దాంతం సృష్టిస్తున్నారని అన్నారు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో.. లైంగిక వాంఛలు ఏ స్థాయికి వెళ్లాయో మాత్రమే ఇమ్రాన్ చెప్పారని, మహిళల వస్త్రధారణపై ఆయన తప్పుగా మాట్లాడలేదని ఖాలిద్ అన్నారు. మొన్న ఏప్రిల్ లోనూ ఇమ్రాన్ ఇంచుమించు ఇలాంటి మాటలే మాట్లాడి చులకన అయ్యారు..
మరిన్ని ఇక్కడ చూడండి: నేడో, రేపో టీపీసీసీ కొత్త చీఫ్..!కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తులకు బ్రేక్ :Telangana New PCC Chief ? Live Video
viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.
Sonu Sood Video: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు లగ్జరీ కారు ఇవ్వడంపై సోనూసూద్ క్లారిటీ వీడియో .