అమితాబ్ కుటుంబ పూజారిపై పోలీసుల దాడి..గుడిలోనే పూజారిని కొట్టిన వైనం వైరల్ అవుతున్న వీడియో :Viral Video.

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబ పూజారి అమిత్ పాండేపై ఆదివారం యూపీలోని వింధ్యాచల్ లో గల వింధ్యవాసిని ఆలయంలో పోలీసులు దాడి చేశారు. ఆయనపై పిడి గుద్దుల వర్షం కురిపించారు. వారికి, ఇతర పూజారులకు మధ్య కూడా ఘర్షణ జరిగి ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబ పూజారి అమిత్ పాండేపై ఆదివారం యూపీలోని వింధ్యాచల్ లో గల వింధ్యవాసిని ఆలయంలో పోలీసులు దాడి చేశారు. ఆయనపై పిడి గుద్దుల వర్షం కురిపించారు. వారికి, ఇతర పూజారులకు మధ్య కూడా ఘర్షణ జరిగి ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇంకా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ.. చాందౌలీ జిల్లా మేజిస్ట్రేట్ తన కుటుంబంతో సహా వచ్చి ఆలయంలో పూజలు చేశారు.దీంతో తాము కూడా పూజలు చేసేందుకు పూజారులు పూనుకోగా పోలీసులు అడ్డు చెప్పారు. ఆ మేజిస్ట్రేట్ కుటుంబాన్ని అనుమతించినప్పుడు తమను ఎందుకు అనుమతించరని పూజారులు వారితో వాగ్యుధానికి దిగారు. ఈ క్రమంలో అప్పుడే అక్కడికి వచ్చిన అమిత్ పాండే బలవంతంగా పూజలు చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. విచక్షణా రహితంగా ఆయనపై చెయ్యి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొందరు పూజారులు స్వల్పంగా గాయపడ్డారు. సుమారు గంటసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇంత జరుగుతున్నా చాందౌలీ జిల్లా మేజిస్ట్రేట్ మౌన ప్రేక్షక పాత్ర వహించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: స్ట్రాతో ఊపిరి ఊదుతూ నాగపాము కు ప్రాణం పోసిన యువకుడు..వైరల్ అవుతున్న వీడియో :Viral Video.

టాలీవుడ్ పై ఆసక్తి చూపుతున్న తమిళ్ హీరోస్ ..త్వరలో స్ట్రయిట్ తెలుగు మూవీలో హీరో కార్తీ..!:Tamil Actors Video.

 వినాయక చవితి కానుకగా ‘అఖండ’ ?బాలయ్య- బోయపాటి సినిమాకు ముహూర్తం ఎప్పుడంటే ?Akhanda Movie video.

Director Puri shocking comments : జీవితం మూడు రోజుల డ్రామా..వివాహం ద్వారా జీవితకాల నరకం ఎందుకు?