AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Pandey : అది నిజమైతే మీకే ముందు స్వీట్స్ ఇస్తా .. గర్భవతి వార్తలపై స్పందించిన పూనమ్ పాండే

Poonam Pandey : అమ్మదనంలోని కమ్మదనం అనుభవించాలని.. మాతృ ప్రేమను తన బిడ్డలకు పంచాలని.. అమ్మా అని పిలుపుకోసం ప్రతి మహిళ కోరుకుంటుంది. లేలేత శరీరంతో..  కల్మషం లేని..

Poonam Pandey : అది నిజమైతే మీకే ముందు స్వీట్స్ ఇస్తా .. గర్భవతి వార్తలపై స్పందించిన పూనమ్ పాండే
Poonam Pandey
Surya Kala
|

Updated on: Jun 22, 2021 | 3:46 PM

Share

Poonam Pandey : అమ్మదనంలోని కమ్మదనం అనుభవించాలని.. మాతృ ప్రేమను తన బిడ్డలకు పంచాలని.. అమ్మా అని పిలుపుకోసం ప్రతి మహిళ కోరుకుంటుంది. లేలేత శరీరంతో..  కల్మషం లేని చిరునవ్వుతో పొత్తిళ్ళలో పాపాయితో ఆడుకోవాలని.. స్త్రీ ఎంతగానో ఎదురుచూస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి రాబోయే సరికొత్త ప్రాణి కోసం ఆలోచిస్తూ.. ఆ చిన్నారి కోసం ఎన్నో కలలు కంటుంది, అయితే నలుగురికి నచ్చింది.. నాకు అసలే నచ్చదు అంటుంది ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే.. తనకు గర్భవతి అవ్వడం అనేది చాలా బాధకలిగించే వార్త అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

గత కొంతకాలంగా పూనమ్‌ పాండే .. సామ్‌ బాంబే దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన పూనమ్ తాను గర్భవతి అన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఇటువంటి తప్పు కథనాలతో నన్ను అనవసరంగా గర్భవతిని చేయకండి అంది.. ఏ మహిళకైనా గర్భవతి అని తెలిసిన వెంటనే సంతోషం కలుగుతుంది. కానీ నాకు అలా కాదు.. ఎందుకంటే ఆ వార్తల్లో నిజంలేదు అంటూ వ్యాఖ్యానించింది. ఇక నుంచి ఇటువంటి వార్తలు రాసేవారు తనని అడగాలని కోరింది. తాను నిజంగా గర్భవతిని ఐతే అందరికీ చెప్పి.. స్వీట్స్ పంచుతానని చెప్పింది. పూనమ్ పాండే డైరెక్టర్ సామ్‌ బాంబే 2020 సెప్టెంబర్‌ 1న పెళ్లి చేసుకున్నారు. కొని రోజులకే తన భర్త తనను హింసిస్తున్నాడంటూ గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే.. అయితే మళ్ళీ కొన్ని రోజులకే తన భర్త చాలా మంచివాడు అంటూ ఆ కేసుని వెనక్కి తీసుకుని భార్య భర్తల మధ్య మనస్పర్థలు సర్వసాధారణమని.. తాము మళ్ళీ కలిసిపోయామని చెప్పింది.

Also Read: మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. చింతగింజలతో ఇలా చేస్తే ఎంతో ఉపశమనం