Tadepalli Gang Rape Case: యువతిపై అత్యాచార ఘటనపై స్పందించిన సీఎం జగన్..

తాడేపల్లిలోని సీతానగరం ఘాట్ వద్ద యువతిపై జరిగిన అత్యాచార ఘటన కలచివేసిందని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా...

Tadepalli Gang Rape Case: యువతిపై అత్యాచార ఘటనపై స్పందించిన సీఎం జగన్..
CM YS Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 22, 2021 | 4:12 PM

తాడేపల్లిలోని సీతానగరం ఘాట్ వద్ద యువతిపై జరిగిన అత్యాచార ఘటన కలచివేసిందని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా, భయం లేకుండా తిరిగే పరిస్థితులు కల్పించేందుకు మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర పోలీసు శాఖ తీసుకొచ్చిన యాప్​ను మహిళలు వినియోగించాలని గుర్తుచేశారు.

మరోవైపు  గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో యువతిపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడు పెంచారు. సీతానగరం ప్రాంతంలో ఉండే పాత నేరస్థులను విచారిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరూ కనిపించినా.. అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరికొందరి కదలికలపై నిఘా పెట్టారు. ఘటన జరిగిన రోజు వారు ఎక్కడున్నారనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. విచారణలో పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. నిందితులను బాధితురాలు గుర్తించినట్లు సమాచారం. వీరిపై గతంలో పుష్కర ఘాట్లలో ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేసి దోపిడిలకు పాల్పడిన కేసులున్నాయని తెలుస్తోంది. ఈ ఘటనలో వారి ప్రమేయం ఏ మేరకు ఉందనే అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. పూర్తి ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

అసలే జరిగిందంటే…

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి సీతానగరంలో ఇటీవల దారుణం చోటుచేసుకుంది. కృష్ణానది తీరం ఇసుకలో కూర్చున్న ప్రేమజంటపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ప్రియుడిపై దాడి చేసి.. తాళ్లతో కట్టేశారు. అనంతరం పుష్కరఘాట్​లోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. యువతిని చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

Also Read: ఆ మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో నేరుగా నగదు జమ

 వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని మళ్లీ మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!