Mega Compliment : వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని మళ్లీ మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టి భారీ సంఖ్యలో కరోనా టీకాలు వేయడాన్ని ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి..

Mega Compliment : వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని మళ్లీ మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి
Megastar Chiranjeevi
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 22, 2021 | 1:52 PM

Chiranjeevi : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టి భారీ సంఖ్యలో కరోనా టీకాలు వేయడాన్ని ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కొవిడ్‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా వేదికగా చిరు అభినందించారు.

కొవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు అంటూ చిరు ట్వీట్‌ చేశారు. గతంలో కూడా జగన్ సర్కారుపై చిరు ప్రశంసలు కురించిన సందర్భాలు ఉన్నాయి.

కొవిడ్ వ్యాక్సినేషన్‌లో ఎపి కొత్త రికార్డు, జాతీయ స్థాయిలో ఒకే రోజు అత్యధికంగా వ్యాక్సినేషన్ వేసిన ఘనత

కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ ఈనెల 20వ తేదీన కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చిన రికార్డును తనకు తానే తిరగరాసింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. ఉదయం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రజలకు చేరువ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 2232 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్‌ గా నిర్వహించారు. ఫలితంగా కొవిడ్ నియంత్రణ చర్యల్లో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరోసారి వ్యాక్సినేషన్‌లో తన సామర్థ్యంను చాటుకున్నట్లైంది.

గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించాలన్న సీఎం ఆదేశాలను వైద్య, ఆరోగ్యశాఖ కార్యరూపంలోకి తీసుకువచ్చింది. దీనికితోడు క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలకు వ్యాక్సినేషన్‌లో అవసరమైన శిక్షణను అందించడం, ప్రతి యాబై ఇళ్లకు నియమించిన వాలంటీర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవగాహన కల్పించడం వల్ల ఒకేరోజు లక్షలాధి మందికి వ్యాక్సిన్‌ను అందించే సామర్థ్యంను ఎపి సొంతం చేసుకుంది.

గతంలో ఒకేరోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ అందించి వైద్య, ఆరోగ్యరంగంలో తమ సంసిద్దతతను పరీక్షించుకుంది. నేడు దానిని కూడా అధిగమించి దాదాపు పదమూడు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయడం జాతీయ స్థాయిలోనే కొత్త రికార్డును సృష్టించింది జగన్ సర్కారు.

Read also : Vasalamarri : సంబరపడిపోతోన్న వాసాలమర్రి.. అధినేత ఎంట్రీతో ఇక తమ గ్రామ రూపురేఖలు మారనున్నాయని ఆనందం