Saranga Dariya: నెమలి లాంటి నాట్యం, కోయిల లాంటి గాత్రం.. ఎన్నో రికార్డులు దాసోహం.. తాజాగా

ఆమె నాట్యం చేస్తుంటే నెమలి పురి విప్పి నాట్యం చేస్తున్నట్లు ఉంటుంది. చూస్తుంటే మన పక్కింటే అమ్మాయిలాగే అనిపిస్తుంది. సగటు మధ్యతరగతి కుటుంబాల్లో...

Saranga Dariya: నెమలి లాంటి నాట్యం, కోయిల లాంటి గాత్రం.. ఎన్నో రికార్డులు దాసోహం.. తాజాగా
Saranga-Dariya-Song
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 22, 2021 | 7:00 PM

ఆమె నాట్యం చేస్తుంటే నెమలి పురి విప్పి నాట్యం చేస్తున్నట్లు ఉంటుంది. చూస్తుంటే మన పక్కింటే అమ్మాయిలాగే అనిపిస్తుంది. సగటు మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించే అమ్మాయిలానే ఆమె పోషించే పాత్రలు ఉంటాయి. అంతేకాదు చూడచక్కనైన అందం, ప్రేక్షకులను సినిమాలో లీనం చేసే అభినయం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ ఇంట్రో అంతా సాయి పల్లవి గురించి అని. అవును మీ గెస్ కరెక్ట్. ఈ అమ్మడు నాట్యమాడిన ‘లవ్‌స్టోరి’ చిత్రంలోని ‘సారంగ దరియా..’ పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయి పల్లవి డ్యాన్స్ చూసి జనాలు ఆమె ఫీవర్‌తో ఊగిపోయారు.  ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. నెట్టింట విడుదలైన నెల రోజుల్లోనే 10 కోట్ల వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించిన ఈ సాంగ్.. అతి తక్కువ కాలంలోనే 20కోట్లకు పైగా వ్యూస్‌ సాధించింది. ఇప్పుడు ఏకంగా 25 కోట్ల వ్యూస్‌తో ఇంకా సత్తా చాటుతోంది. సినిమా విడుదలకు ముందే వ్యూస్‌తో రికార్డులు సృష్టించిన అతి తక్కువ సినిమా పాటల్లో ‘సారంగ దరియా’ ఒకటి కావడం విశేషం.  అక్కినేని నాగ చైతన్య , సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. పవన్‌ సి.హెచ్‌ స్వరాలందించారు. రచయిత సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యంతో కొత్త సొబగులద్దుకున్న ఈ తెలంగాణ జానపదాన్ని.. మంగ్లీ ఆలపించిన తీరు, దానికి హుషారెత్తించేలా సాయి పల్లవి డ్యాన్స్.. పాటను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. అందుకే ఈ పాటకు యూట్యూబ్‌లో ఇంతటి ఆదరణ దక్కుతోంది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రం తెరకెక్కింది.

తెలంగాణలో ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తేశారు. ఏపీలో మరో వారం, 10 రోజుల్లో అదే జరగబోతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల ప్రారంభంలో థియేటర్లు తెరుచుకోనున్నాయని సమాచారం అందుతోంది. దీంతో కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. సినిమాహాళ్లు తెరిచిన వెంటనే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ‘లవ్​స్టోరి’ విడుదల కానుందని ఫిల్మ్ నగర్ టాక్.

Also Read: 18వేల కిలోల బాంబు నడిసముద్రంలో పేలితే ఎట్టా ఉంటుందో తెలుసా..?.. వీడియో చూసెయ్యండి

పెద్ద పులితో యువకుల పరాచకాలు.. అది ఏం చేసిందో మీరే చూడండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!