Baba Ramdev: సుప్రీంకోర్టుకెక్కిన యోగాగురు బాబా రాందేవ్… FIRలపై స్టే ఇవ్వాలంటూ..
Baba Ramdev: ఆలోపతిపై తన వ్యాఖ్యలను నిరసిస్తూ వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ ల మీద ప్రొసీడింగ్స్ చేపట్టరాదని కోరుతూ యోగా గురు బాబా రాందేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆలోపతిపై తన వ్యాఖ్యలను నిరసిస్తూ వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ ల మీద ప్రొసీడింగ్స్ చేపట్టరాదని కోరుతూ యోగా గురు బాబా రాందేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిని కొట్టివేసేలా చూడాలని అభ్యర్థించారు. ఆలోపతిపైన, డాక్టర్లపైనా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహా పలు వైద్య సంఘాలు వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశాయి. దీంతో ఆయనపై ఆయా పోలీసు స్టేషన్లలో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఆలోపతిని స్టుపిడ్ మెడిసిన్ అని, దీనివల్లే ఎంతోమంది కోవిద్ రోగులు మృతి చెందారని ఆరోపిస్తూ ఆయన మొదట సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆయనను అరెస్టు చేయాలని..కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఉత్తరాఖండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ…బాబా రాందేవ్ 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని..లేని పక్షంలో ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. అలాగే యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్టాల్లో ఆయనపై ఎఫ్ ఐ ఆర్ లు దాఖలైన విషయం తెలిసిందే..
కాగా తనను ఎవరూ అరెస్టు చేయలేరని… అసలు తాను మెడికల్ మాఫియా గురించి ప్రస్తావించానే తప్ప డాక్టర్లను కించపరచలేదని ఆయన ఆ తరువాత ఓ వీడియోలో తెలిపారు. అయినా తన వ్యాఖ్యలకు అప్పుడే అపాలజీ చెప్పానన్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ తీవ్రంగా లేఖ రాసిన తరువాత బాబా రామ్ దేవ్ తన వైఖరి మార్చుకున్నారు. కోవిద్ రోగులకు సేవలు….. చికిత్సలు చేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిపై తనకెంతో గౌరవం ఉందన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Rice Water : అన్నం వండిన తర్వాత గంజిని పడేస్తున్నారా.. అది తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా
Captain of The 21st Century: 21 వ శతాబ్దపు టెస్ట్ కెప్టెన్ గా ఆసీస్ మాజీ ఆటగాడు స్టీవ్ వా ఎంపిక..!