Captain of The 21st Century: 21 వ శతాబ్దపు టెస్ట్ కెప్టెన్‌ గా ఆసీస్ మాజీ ఆటగాడు స్టీవ్ వా ఎంపిక..!

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 21 వ శతాబ్దపు బెస్ట్‌ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్‌ సోషల్ మీడియాలో ప్రకటించింది.

Captain of The 21st Century: 21 వ శతాబ్దపు టెస్ట్ కెప్టెన్‌ గా ఆసీస్ మాజీ ఆటగాడు స్టీవ్ వా ఎంపిక..!
Steve Waugh Elected As Greatest Test Captain Of The 21st Century
Follow us

|

Updated on: Jun 23, 2021 | 4:26 PM

Greatest Test Captain of The 21st Century: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 21 వ శతాబ్దపు బెస్ట్‌ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్‌ సోషల్ మీడియాలో ప్రకటించింది. రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్, విరాట్ కోహ్లీలతో పోటీ పడి విజేతగా నిలిచినట్లు స్టార్‌స్పోర్ట్స్‌ ప్యానల్ పేర్కొంది. ఈ ఎంపికపై పోల్ నిర్వహించిన స్టార్ స్పోర్ట్స్.. నిన్న తుది ఫలితాన్ని విడుదల చేసింది. కాగా, తుది నిర్ణయం మాత్రం భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీసుకున్నట్లు స్టార్‌స్పోర్ట్స్‌ వెల్లడించింది.

స్టీవ్ వా, గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. అగ్రస్థానంలో స్టీవ్‌ వా నిలవగా, స్మిత్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వా హయాంలో ఆస్ట్రేలియన్లు ప్రపంచ క్రికెట్‌లో అజేయంగా నిలిచారు. ఏకధాటిగా 16 టెస్టుల్లో గెలిచి ప్రపంచ క్రికెట్‌‌ను శాసించారు. కానీ, 2001 లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్‌తో వారి ప్రాభవం పడిపోయింది. స్టార్‌స్పోర్ట్స్‌ ప్యానల్‌లో సంజయ్ బంగర్, వీవీఎస్ లక్ష్మణ్, నాజర్ హుస్సేన్ లాంటి ప్రముఖ మాజీలు ఉన్నారు. వీరిలో హుస్సేన్, లక్ష్మణ్‌లు స్మిత్‌ను ఎంచుకోగా, బంగార్ మాత్రం స్టీవ్ వా కు ఓటు వేశాడు.

ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ, స్మిత్ దక్షిణాఫ్రికా జట్టును కింది స్థాయి నుంచి నిర్మించేందుకు కీలక పాత్ర పోషించాడు. స్టీవ్‌ వాకు మాత్రం షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్ లాంటి గొప్ప ప్లేయర్ల అండ లభించిందని పేర్కొన్నాడు. ‘‘ నా ఓటు కచ్చితంగా స్మిత్ కే. ఎందుకంటే ఆయన జట్టును తయారుచేసిన విధానం చాలా ప్రత్యేకమైంది. స్టీవ్‌ వా, ‎పాంటింగ్ లకు మాత్రం షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్, జాసన్ గిల్లెస్పీ వంటి ఆటగాళ్లు అండగా నిలిచారు. మరోవైపు స్మిత్ చిన్న వయస్సులో జట్టుకు నాయకుడిగా మారాడని” లక్ష్మణ్ వెల్లడించాడు. హాన్సీ క్రోన్జే నాయకత్వంలో చెలరేగిన వివాదాల నుంచి జట్టును ముందుకు సాగించి, గొప్పగా పునర్నిర్మించాడని స్మిత్‌ను హుస్సేన్ ప్రశంసించాడు.

అయితే, భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరును మాత్రం ఈ ఎలైట్ కెప్టెన్ల జాబితాలో చేర్చక పోవడం గమనార్హం. మొహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో భారత టీం మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుంది. ఈ కారణంగా జట్టు గందరగోళానికి గురైంది. ఈ వివాదాల అనంతరం టీమిండియాను పునర్నిర్మించిన ఘనత గంగూలీకే చెందుతుంది. అనంతరం జరిగిన 2003 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడంలో దాదా కీలక పాత్ర పోషించాడనేది అక్షర సత్యం. గంగూలీ నాయకత్వంలో 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరడంతోపాటు, 2002 నాట్వెస్ట్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది.

Also Read:

IND Vs NZ, WTC Final 2021 Day 6th Live: రిజర్వ్‌డేకు చేరిన ఫైనల్‌ మ్యాచ్‌.. పెవిలియన్‌కు పుజారా

Shaminda Eranga : టెస్ట్, వన్డే, టీ 20 ఫార్మాట్లలో మొదటి ఓవర్‌లోనే వికెట్ సాధించిన ఏకైక బౌలర్..!

On This Day in Cricket: టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి నేటికి 8 ఏళ్లు.. మూడు ఐసీసీ ట్రోఫీలతో కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ రికార్డు!

Sachin and Yuvraj Singh : సచిన్, యువరాజ్ సింగ్‌ల కొత్త ఆట..! వీరికి మరో పార్ట్‌నర్ జత కలిసాడు.. ఇంతకి ఏం చేశారో తెలుసా..?

International Olympic Day 2021: ఈ ఏడాది నిర్వహించే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ థీమ్ ఏంటో తెలుసా..?

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా