Sachin and Yuvraj Singh : సచిన్, యువరాజ్ సింగ్‌ల కొత్త ఆట..! వీరికి మరో పార్ట్‌నర్ జత కలిసాడు.. ఇంతకి ఏం చేశారో తెలుసా..?

Sachin and Yuvraj Singh : భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ దేశానికి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను

Sachin and Yuvraj Singh : సచిన్, యువరాజ్ సింగ్‌ల కొత్త ఆట..! వీరికి మరో పార్ట్‌నర్ జత కలిసాడు.. ఇంతకి ఏం చేశారో తెలుసా..?
Sachin And Yuvraj Singh

Sachin and Yuvraj Singh : భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ దేశానికి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. అతను క్రికెట్ మైదానంలో చాలా మంది తోటి ఆటగాళ్లతో సన్నిహితులుగా ఉంటాడు కానీ సచిన్ టెండూల్కర్‌తో అతని సంబంధం భిన్నంగా ఉంటుంది. యువరాజ్ సింగ్, సచిన్ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కానీ ఇప్పుడు చాలా సందర్భాలలో ఈ అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు కలిసి కనిపిస్తారు. అయితే తేడా ఏమిటంటే ఈసారి క్రికెట్ కాదు గోల్ఫ్ కోర్సు. ఇద్దరూ కలిసి గోల్ఫ్ ఆడటం ఇది మొదటిసారి కాదు. గతంలో యువరాజ్, సచిన్ గోల్ఫ్ ఆడుతున్నప్పుడు తీసిన వీడియోలు, చిత్రాలను వారి సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు. అయితే ఈసారి అతనితో పాటు మరో భారతీయ అనుభవజ్ఞుడు కూడా కనిపించాడు.

యువరాజ్ సింగ్ చిత్రాలను షేర్ చేశాడు..
యువరాజ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సచిన్, అజిత్ అగర్కర్‌లతో కలిసి చిత్రాలను షేర్ చేశాడు. ‘చివరిసారిగా మీరు 21 సంవత్సరాల క్రితం షార్జా పర్యటన కోసం తెల్లవారుజామున 4 గంటలకు నన్ను నిద్రలేపారు. అది నా మొదటి సందర్శన. అజిత్ అగర్కర్ తప్పక అలవాటు పడ్డారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ చిత్రాలలో ఈ ఇద్దరు అనుభవజ్ఞులతో అజిత్ అగర్కర్ కూడా కనిపించాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కర్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత గోల్ఫ్ ఆడుతున్నాడు. అనేక గోల్ఫ్ టోర్నమెంట్లను కూడా గెలుచుకున్నాడు.

యువరాజ్ సింగ్, సచిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. సచిన్ తరచూ త్రోబాక్‌లను, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. యువరాజ్ సింగ్ తాను గోల్ఫ్ ఆడుతున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు.

AP-TS Water Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ రాజుకున్న కృష్ణా నదీ జలవివాదం.. నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు

Mangli: మాటకారి మంగ్లీ బ్యూటిఫుల్ ఫోటో గ్యాలరీ… క్యూట్ స్మైల్ కు ఫిదా అవుతున్న అభిమానులు…

Kanipakam: కాణిపాకం వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి వెలంపల్లి భూమి పూజ.. అమెరికాకు చెందిన దాత రూ. 9 కోట్ల విరాళం