Kanipakam: కాణిపాకం వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి వెలంపల్లి భూమి పూజ.. అమెరికాకు చెందిన దాత రూ. 9 కోట్ల విరాళం

Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి...

Kanipakam: కాణిపాకం వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి వెలంపల్లి భూమి పూజ.. అమెరికాకు చెందిన దాత రూ. 9 కోట్ల విరాళం
Kanipakam Temple
Follow us
Surya Kala

|

Updated on: Jun 23, 2021 | 2:55 PM

Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రాచమంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.  ఆలయ మూషికమండపం, మంత్రాలయం, అద్దాలమండపం, గర్భగుడి చుట్టూ ఉన్న ఆలయ ప్రాకారాలని పడగొట్టి ప్రభుత్వం తిరిగి నిర్మించనున్నది. ఈ పునర్నిర్మాణ పనుల కోసం అమెరికాకు చెందిన దాత 9 కోట్ల రూపాయల నిధులను విరాళంగా ఇచ్చారు. ఈ నిధులతో ఆలయ పునర్మిణాన పనులు ప్రారంభమయ్యాయి. ఇదే విషయంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ..  చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని కాణిపాక ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం లో అన్ని దేవాలయాలను అభివృద్ధి  చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు..కొంత మంది రాజకీయ నాయకులు మతవిద్వేషాలు రాజకీయం చేస్తున్నారని వారికి దేవుడే బుద్ధి చెబుతారని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

బహుదా నది ఒడ్డున వక్రతుండ మహాకాయుడైన వినాయకుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం కాణిపాకం. ఇక్కడ సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఏ దేవుడి మీద ఒట్టు వేసినా నమ్మనివారు కూడా కాణిపాకం ఆలయ ఆవరణలో ఎవరైనా ప్రమాణం చేస్తే మాత్రం నమ్ముతారు. తరతరాలుగా సత్యప్రమాణాలు గల దేవునిగాచ భక్తుల పూజలు అందుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు. ఈ క్షేత్రానికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు

స్వామీ వారి ముందు ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం.

Also Read: మగువల మనసు దోచే రంగుల గాజులు.. ఏ రంగు గాజులతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.