AP-TS Water Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ రాజుకున్న కృష్ణా నదీ జలవివాదం.. నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు

తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదం రాజుకుంది. కృష్ణా జలాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య వార్‌ మళ్లీ మొదలైంది.

Balaraju Goud

|

Updated on: Jun 23, 2021 | 2:57 PM

శ్రీశైలానికి ఎడమ వైపు తెలంగాణ... కుడి వైపు రాయలసీమ. రెండు వైపులా ఈ కృష్ణా నీళ్లే కీలకం. రెండు ప్రాంతాలకు తాగు, సాగునీటికి శ్రీశైలమే ఆధారం. వరదలు వచ్చినప్పుడు ఏ సమస్యా ఉండదు. ఎవరికి ఎంత కావాలన్నా వాడుకోవచ్చు. నీటి ప్రవాహలు తగ్గినప్పుడే అసలు సమస్య. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తోంది.

1 / 8
ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉన్న RDS కుడి కాలువ పనులతో రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ నీళ్లు అగ్గి రాజేశాయి. ఏపీ పనులు ప్రారంభించడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది తెలంగాణ. ఈ నేపథ్యంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్‌ వార్‌కు దారితీశాయి.

2 / 8
లంకలో ఉన్నోళ్లంతా రాక్షసులే, ఆంధ్రోళ్లంతా తెలంగాణ వ్యతిరేకులేనని నిన్న కామెంట్‌ చేశారు ప్రశాంత్‌రెడ్డి. నీళ్ల కోసం యుద్ధం తప్పదని హెచ్చరించారు. వైఎస్‌ నీళ్ల దొంగ అని, జగన్‌ గజదొంగ అని కామెంట్‌ చేశారు.

3 / 8
Somu Veerraju

Somu Veerraju

4 / 8
AP Minister Anil Kumar Yadav

AP Minister Anil Kumar Yadav

5 / 8
నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని గతంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయన్నారు.

6 / 8
Gangula Kamalakar

Gangula Kamalakar

7 / 8
తాజా వివాదంతో వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే కృష్ణా బోర్డుకు మరోసారి ఫిర్యాదు చేసింది తెలంగాణ సర్కార్‌. వెంటనే ఏపీ ప్రాజెక్ట్‌లపై పరిశీలన చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

8 / 8
Follow us