- Telugu News Photo Gallery Political photos Minister ktr says thanks to cm kcr to kaleshwaram water reaches manair reservoir
Manair Reservoir: కోటి ఎకరాల మాగాణం దిశగా తెలంగాణ.. పచ్చని పొలాలుగా మారుతున్న బీడు భూములు.. ఆకుపచ్చని తివాచీ చిత్రాలు
స్వరాష్ట్రంలో ఒక్కొక్కటిగా కళ సాకారమవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం దిశగా దూసుకెళుతుంది.
Updated on: Jun 24, 2021 | 2:53 PM

స్వరాష్ట్రంలో ఒక్కొక్కటిగా కళ సాకారమవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం దిశగా దూసుకెళుతుంది. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. చివరి ఎకరా వరకు నీళ్లందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఆరేళ్ల కిందటి వరకు పల్లేర్లు మొలిచిన బీడు భూములు ప్రస్తతం పచ్చని పంట పొలాలుగా మారాయి.

అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి వర్షాకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో సిరిసిల్ల రైతాంగం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలతో వేసవిలోనే అప్పర్ మానేరు నిండింది. 2.2 టిఎంసీ ల నీటితో ప్రాజెక్టు జల కళను సంతరించుకొంది.

సీఎం కేసీఆర్ కార్యదక్షతతో వానకాలం పంటకు నీళ్ళు వచ్చాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. జూలై మొదటి వారంలో అప్పర్ మానేరు నీటి విడుదలకై ఇరిగేషన్ అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది.

సిరిసిల్ల ప్రాంతం ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నిజం అవుతుండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Crop Holiday





























