On This Day in Cricket: టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి నేటికి 8 ఏళ్లు.. మూడు ఐసీసీ ట్రోఫీలతో కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ రికార్డు!
సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా కెప్టెన్ ధోనీ.. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును సాధించి ఇండియన్ క్రికెట్‌లోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త కెప్టెన్‌గా అవతరించాడు.
ICC Champions Trophy: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా కెప్టెన్ ధోనీ.. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును సాధించి ఇండియన్ క్రికెట్‌లోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త కెప్టెన్‌గా అవతరించాడు. కెప్టెన్ కూల్ గా పేరుగాంచిన ధోనీ.. ఎలాంటి మ్యాచ్‌నైనా మార్చేయగల కెప్టెన్సీతో అందర్నీ తనవైపు ఆకర్షించాడు. అలాగే ధోనీ హయాంలోనే టీమిండియా 3 ఐసీసీ ట్రోఫీలు సాధించింది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్ కప్‌తోపాటు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారత క్రికెట్‌కు అందించాడు ఈ మిస్టర్ కూల్. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది. దీంతో అప్పటికే రెండు ఐసీసీ ట్రోఫీలతో పేరుగాంచిన ధోనీ సేన.. మూడోసారి ట్రోఫీ బరిలో నిలవడంతో.. ధోనీ సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఛాంపియన్ ట్రోఫీ గెలిచి 8ఏళ్లైన సందర్భంగా… ఆనాటి మ్యాచ్ విశేషాలను ఓ సారి చూద్దాం…
మ్యాచ్ విషయానికి వస్తే.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో.. భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. వర్షంతో ఫైనల్ మ్యాచ్‌ను 20 ఓవర్లకు తగ్గించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌లో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ 43 పరుగులు, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 33 పరుగులతో రాణించారు. 130 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. జడేజా, అశ్విన్, ఇషాంత్ శర్మ అద్భుత బౌలింగ్ తో కేవలం 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులకే పరిమితమైంది. దీంతో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోపిని కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ టీంలో ఇయాన్ మోర్గాన్ 33 పరుగులు, రవి బొపారా 30 పరుగులతో ఆకట్టుకోగా.. మిగతా బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన జడేజా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకోగా.. సిరీస్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.
టీమిండియా ఖాతాలో 5 ఐసీసీ ట్రోఫీలు.. ఇప్పటి వరకు టీమిండియా ఖాతాలో 5 ఐసీసీ ట్రోఫీలు చేరాయి. అలాగే ఆస్ట్రేలియా తరువాత భారత్.. ఎక్కువ సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 2002లో శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షంతో రద్దైంది. దీంతో శ్రీలంక, భారత్‌లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటించింది. అలాగే కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే.
అలాగే ప్రస్తుతం జరుగుతోన్న ఐసీసీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ భారత్ ట్రోఫీ పోరులో నిలిచింది. వర్షంతో మ్యాచ్ ఫలితం రిజర్వ్‌డే కు చేరింది. ఈ రోజు డబ్ల్యూటీసీ ఫైనల్ ట్రోఫీని ఎవరు గెలుస్తారో తెలియనుంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. కివీస్, భారత్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనుంది ఐసీసీ.
?️ #OnThisDay in 2013, ? Edgbaston, Birmingham
The @msdhoni-led #TeamIndia beat England to lift the ICC Champions Trophy. ? ? pic.twitter.com/f6sdMyureL
— BCCI (@BCCI) June 23, 2021
Also Read:
International Olympic Day 2021: ఈ ఏడాది నిర్వహించే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ థీమ్ ఏంటో తెలుసా..?
సచిన్ తొలి పాట.. ‘త్రోబ్యాక్’ వీడియోను షేర్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న క్రికెట్ గాడ్.!
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీని ఇలా మీరెప్పుడూ చూసుండరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..