International Olympic Day 2021: ఈ ఏడాది నిర్వహించే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ థీమ్ ఏంటో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించేందుకు నిర్దేశించినదే ఈ ప్ర‌పంచ ఒలింపిక్ క్రీడ‌ల దినోత్సవం. క్రీడలు మన జీవితంలో ఒక భాగమని చాటే చెప్పడమే దీని ప్రధాన లక్ష్యం.

International Olympic Day 2021: ఈ ఏడాది నిర్వహించే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ థీమ్ ఏంటో తెలుసా..?
International Olympic Day 2021
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Jul 05, 2021 | 5:26 PM

International Olympic Day 2021: ప్రతీ సంవత్సరం జూన్ 23 న అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం నిర్వహిస్తారు. 1894లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్థాపించిన రోజునే మనం అందర్జాతీయ ఒలింపిక్స్‌ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. ప్రపంచ వ్యాప్తంగా క్రీడలను వ్యాప్తి చెందిండమే దీని ప్రధాన లక్ష్యం. అలాగే క్రీడలు మన జీవితంతో ఒక భాగమనే సందేశాన్ని బలంగా వ్వాప్తి చేస్తోంది అంతర్జాతీ ఒలింపిక్ కమిటీ.

క్రీ.పూ.776 లో ఒలింపిక్ క్రీడలు మొదలయ్యాయి. అయితే క్రీ.శ.393లో వీటిని నిలిపేశారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్‌దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్‌. 1894లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ను స్థాపించి, మరలా క్రీ.శ.1896లో ఏథెన్స్‌లో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యేలా కీలక పాత్ర పోషించాడు.

అంతర్జాతీయ ఒలింపిక్ డే చరిత్ర 1947 లో చెకోస్లోవేకియాలోని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడు డాక్టర్ గ్రస్.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 41 వ సమావేశంలో ఒక నివేదికను సమర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒలింపిక్ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని అందులో పేర్కొన్నాడు. దీంతో 1948 లో పారిస్లోని సోర్బొన్నెలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జూన్ 23 ను అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహించుకోవాలని తీర్మానం చేసింది. దీంతో ప్రతిఏటా జూన్ 23న అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తారు. తొలి ఒలింపిక్ దినోత్సవాన్ని 1948వ సంవత్సరంలో నిర్వహించారు. ఒలింపిక్ క్రీడలను ప్రోత్సహించడంతోపాటు ఈ పోటీలలో ఎక్కువ మంది పాల్గొనేలా ఈ స్పెషల్ డే ఎంతో కీలక పాత్రం పోషించింది.

అంతర్జాతీయ ఒలింపిక్ డే ప్రాముఖ్యత, థీమ్

ఒలింపిక్ క్రీడలలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని పాల్గొనేలా చేయడం అలాగే లింగ, వయస్సు భేదం లేకుండా ఎక్కువ మందిని ఈ క్రీడలవైపు ఆకర్షించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇది మూడు విషయాలను వ్యాప్తి “తరలించు లేదా కదిలించు”, “తెలుసుకో లేదా నేర్చుకో”, “అన్వేషించు లేదా కనుగొను” అనే మూడు సూత్రాల ఆధారంగా జాతీయ ఒలింపిక్ కమిటీలు సామాజిక నేపథ్యం లేదా క్రీడా సామర్థ్యంతో సంబంధం లేకుండా అందరూ ఈ క్రీడల్లో పాల్గొనేందుకు కృషి చేస్తోంది.

కొన్ని దేశాలలో ఈ కార్యక్రమం పాఠశాల స్థాయిలో సిలిబస్‌ గా చేర్చారు. అనేక ఎన్‌ఓసీలు ఒలింపిక్ దినోత్సవంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. ఇటీవల ఎన్‌ఓసీ పిల్లలు, యువత కోసం ప్రముఖ అథ్లెట్లతో సమావేశాలు కూడా నిర్వహించాయి. ప్రజలు ఒలింపిక్ దినోత్సవంలో పాల్గొనేలా పోత్సహిస్తోంది. ఈ సంవత్సరం అంతర్జాతీయ ఒలింపిక్ డే థీమ్… ఆరోగ్యంగా ఉండండం, బలంగా తయారవ్వడం, ఒలింపిక్ ప్రాక్టీస్ తో చురుకుగా మారండి అంటూ భోదిస్తోంది.

భయపెడుతోన్న కోవిడ్ టోక్యోలో జులై నుంచి జరిగే ఒలింపిక్ క్రీడలకు ప్రేక్షకులను అనుమితిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జూన్ 21న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. జపాన్ తోపాటు ఐఓసీతో ప్రేక్షకులను అనుమతించడంపై ఎదురయ్యే నష్టాలను చర్చిస్తామని ప్రకటించింది. ఈ క్రీడలకు దాదాపు 10,000 మందిని అనుతిస్తామని ఒలింపిక్ నిర్వాహకులు తెలిపారు. అయితే, విదేశీ ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదని ప్రకటించింది.

అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం సందర్భంగా భాతర ప్రధాని నరేంద్రమోదీ.. టోక్యో క్రీడలకు కేవలం ఒక నెల మాత్రమే ఉందని, ఒలింపిక్ స్ఫూర్తిని కొనసాగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ సందర్భంగా భారత అథ్లెట్లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు బుధవారం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అలాగే “కొన్నేళ్లుగా వివిధ ఒలింపిక్ ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లందరి పోరాటాలతో దేశం గర్విస్తోందని” ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత బృందానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన క్విజ్‌లో అందరూ పాల్గొనాలని పిలిపునిచ్చారు. కాగా, టోక్యో లో జులై 23 నుంచి సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.

Also Read:

సచిన్ తొలి పాట.. ‘త్రోబ్యాక్’ వీడియోను షేర్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న క్రికెట్ గాడ్.!

సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!

Karnam Malleswari: ఆప్ సర్కార్ కీలక నిర్ణయం.. స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా.. కరణం మల్లీశ్వరి నియామకం..

IND Vs NZ, WTC Final 2021 Day 5th Live: రిజర్వ్‌డేకు చేరిన ఫైనల్‌ మ్యాచ్‌.. 32 పరుగుల ఆధిక్యంలో టీమిండియా…

WTC Final: ‘బ్యాట్స్‌మెన్లకే కాదు.. ఐసీసీకి కూడా టైమ్ లేకుండా పోయింది’.. ఐసీసీపై త‌న‌దైన శైలిలో స్పందించిన సెహ్వాగ్‌