Karnam Malleswari: ఆప్ సర్కార్ కీలక నిర్ణయం.. స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా.. కరణం మల్లీశ్వరి నియామకం..

Delhi Sports University: ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన

Karnam Malleswari: ఆప్ సర్కార్ కీలక నిర్ణయం.. స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా.. కరణం మల్లీశ్వరి నియామకం..
Karanama Malleswari
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Jun 23, 2021 | 7:08 AM

Delhi Sports University: ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ.. ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఈ మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి కరణం మల్లీశ్వరి మొట్టమొదటి వీసీ అవుతారని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తామని వివరించారు.

ఇటీవల డిప్యూటీ సీఎం మనీశ్ సిపోడియా.. స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి పలు విషయాలను వెల్లడించారు. క్రీడాకారులు ఇకపై తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందవచ్చని మనీశ్ సిసోడియా తెలిపారు. క్రీడాకారులు ఇతరత్రా డిగ్రీ చేయాల్సిన అవసరం లేదని.. నేరుగా క్రీడా సబ్జెక్టుల్లోనే డిగ్రీ చేయవచ్చని పేర్కొన్నారు.

ఒలింపిక్ క్రీడల్లో దేశానికి కనీసం 50 వరకు పసిడి పతకాలు తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ వర్సిటీ ఏర్పాటు వెనుకున్న ముఖ్య లక్ష్యమని వివరించారు. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడారంగంలో దేశాన్ని గర్వించేలా చేస్తుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు. డిగ్రీ స్థాయి నుంచి పీహెచ్ డీ వరకు వివిధ క్రీడాంశాల్లో వర్సిటీ కోర్సులను అందిస్తుందని తెలిపారు.

Also Read:

200మంది బీజేపీ కార్యకర్తలు మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిక… తప్పు చేశామంటూ…

పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి చిచ్చు… చిక్కుల్లో సీఎం అమరేందర్ సింగ్ ..నాయకత్వ మార్పు తప్పదా …?