Gold Price Today: పతనమవుతున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతమేర తగ్గాయంటే..?

Today Gold Rates: కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. కరోనాతోపాటు.. పసిడి ధరలు కూడా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. గత వారం నుంచి

Gold Price Today: పతనమవుతున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతమేర తగ్గాయంటే..?
Gold Price Today
Follow us

|

Updated on: Jun 23, 2021 | 5:47 AM

Today Gold Rates: కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కరోనాతోపాటు.. పసిడి ధరలు కూడా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. తాజాగా బంగారం ధర మళ్లీ తగ్గింది. బులియన్ మార్కెట్‌ ప్రకారం.. ప్రతిరోజూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోకరోజు పెరుగుతుంటాయి. అయితే.. తాజాగా బుధవారం బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. దేశంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ. 46,120 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,120 గా ఉంది. అంటే.. నిన్నటి ధరకన్నా.. రూ.100 మేర తగ్గింది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. • దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 150 రూపాయల మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,340 గా ఉంది. • ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,120 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,120 వద్ద కొనసాగుతోంది. • బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,100 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,110 వద్ద ఉంది. • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,440 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. • హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది. • విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,110 వద్ద కొనసాగుతోంది. • విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,110 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Carom Seeds: వంటింటి దివ్య ఔషధం.. వాము.. రోజూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటంటే..?

Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..