సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!
Josh Inglis T20 Century: పొట్టి క్రికెట్ వచ్చిన దగ్గర నుంచి రికార్డుల మోత మోగుతోంది. బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. స్పిన్ లేదా స్వింగ్..
పొట్టి క్రికెట్ వచ్చిన దగ్గర నుంచి రికార్డుల మోత మోగుతోంది. బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. స్పిన్ లేదా స్వింగ్.. బౌలింగ్ ఏదైనా మొదటి బంతి నుంచి దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ పెను విధ్వంసం సృష్టించాడు.
లీసెస్టర్షైర్, నార్తాంప్టన్షైర్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ జోష్ ఇంగ్లీస్ వీరబాదుడు బాదాడు. 26 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లీసెస్టర్షైర్ జట్టుపై అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. మొదటి బంతి నుంచి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సుమారు 78 నిమిషాల పాటు క్రీజులో ఉన్న అతడు 62 బంతులు ఎదుర్కుని సూపర్ సెంచరీని పూర్తి చేశాడు.
17 బంతుల్లో 76 పరుగులు…
జోష్ ఇంగ్లీస్ 166.12 స్ట్రైక్ రేట్‌తో 62 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ 103 పరుగులలో, జోష్ 76 పరుగులను కేవలం 17 బంతుల్లోనే రాబట్టడం విశేషం. అంటే చిన్న సైజ్ విధ్వంసం అని చెప్పొచ్చు. జోష్‌కు టీ20ల్లో ఇదే మొదటి సెంచరీ.
13 బంతుల్లో అర్ధ శతకం, చివరి బంతికి అవుట్..
గతంలో సెహ్వాగ్ మాదిరిగా మరో బ్యాట్స్‌మెన్ కూడా వీరబాదుడు బాదాడు. అహ్మద్ ముసాదిక్ 33 బంతుల్లో 115 పరుగులు చేసి చుక్కలు చూపించాడు. అహ్మద్ తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 13 సిక్సర్లు కొట్టాడు, అంటే కేవలం 20 బంతుల్లో 106 పరుగులు చేశాడు.
Also Read:
13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!
పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!