Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

దుకాణదారులు కస్టమర్‌ను ఎలా మోసం చేస్తారో ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. సాధారణంగా ఏ వినియోగదారుడు అయినా సరే..తాజా పండ్లు, కూరగాయలే..

Viral Video: పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!
Fruit Vendor
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Jun 22, 2021 | 6:37 PM

సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో పండ్ల వ్యాపారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. అతడి దగ్గరికి వచ్చిన కస్టమర్లను చాలా తెలివిగా మోసం చేయడం మనం చూడవచ్చు. ఇది చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరు కూడా లుక్కేయండి.!

దుకాణదారులు కస్టమర్‌ను ఎలా మోసం చేస్తారో ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. సాధారణంగా ఏ వినియోగదారుడు అయినా సరే.. తాజా పండ్లు, కూరగాయలే తీసుకుంటారు. నచ్చిన వాటినే ఎరుకుని తూకం వేయించుకుంటారు..కానీ, అక్కడే దుకాణదారులు ప్రజల్ని ఎంతో తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు.

ఇక్కడో కస్టమర్‌ కూడా అలాగే, తనకు నచ్చిన మామిడి పండ్లను తీసుకుని తూకం వేయించుకునేందుకు ఇస్తున్నాడు..కానీ, ఆ పండ్ల బండి వ్యాపారి మాత్రం..అతడు ఏరుకున్న పండ్లను పక్కన పెట్టి మరో నాసిరకం పండ్లను కొనుగోలుదారుకు కట్టబెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలివైన ఈ దుకాణదారుడు..వినియోగదారులను మోసం చేస్తున్న విధానం చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by hepgul5 (@hepgul5)

అత్యంత ఖరీదైన మామిడి…

ఏడు మామిడి పండ్లకు నలుగురు సిబ్బంది, ఆరు కుక్కలు కాపలా కాస్తున్నాయి. ఏంటి.? ఎందుకు అంత సెక్యూరిటీ.! ఇంతకీ ఆ మామిడి పండ్ల ప్రత్యేకత ఏమిటి.? అని అవాక్కు అవుతారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పరిహార్ అనే వ్యక్తి పండించిన ఈ మామిడి పండ్లు కేజీ ధర రూ. 2.70 లక్షలు. మీరు విన్నది నిజమే.? ఎందుకింత ధర అని మీకు డౌట్ రావొచ్చు.! అవి జపాన్‌కు చెందిన మియాజాకి అనే అరుదైన మామిడి వంగడం.

Also Read: 

Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!

రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!