Viral News: ఆ మామిడి పండ్లకు నలుగురు సిబ్బంది, ఆరు కుక్కలు సెక్యూరిటీ.! ఎందుకో తెలుసా.?
మామిడి పండ్లకు నలుగురు సిబ్బంది, ఆరు కుక్కలు కాపలా కాయడం ఏంటి.? ఎందుకు అంత సెక్యూరిటీ.! ఇంతకీ ఆ మామిడి పండ్ల ప్రత్యేకత ఏమిటి.?..
మామిడి పండ్లకు నలుగురు సిబ్బంది, ఆరు కుక్కలు కాపలా కాయడం ఏంటి.? ఎందుకు అంత సెక్యూరిటీ.! ఇంతకీ ఆ మామిడి పండ్ల ప్రత్యేకత ఏమిటి.? అనే విషయాలు తెలుసుకుంటే మీరు నిజంగా అవాక్కు అవుతారు. సహజంగా మామిడి పండు ధర మహా అయితే ఒకటి రూ. 50 ఉంటుంది. అదే మేలు రకం జాతి పండ్లు అయితే కాసింత ధర ఎక్కువ పలుకుంతుంది. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పరిహార్ అనే వ్యక్తి పండించిన ఈ మామిడి పండ్లు కేజీ ధర రూ. 2.70 లక్షలు. మీరు విన్నది నిజమే.? ఎందుకింత ధర అని మీకు డౌట్ రావొచ్చు.! ఇవి ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందిన మామిడి పండ్లని ఆ యజమాని చెబుతున్నాడు.
ఈ మామిడి పండ్లు జపాన్‌కు చెందినా మియాజాకి అనే అరుదైన మామిడి వంగడం. ఒకానొక రోజు పరిహార్ చెన్నైకి ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వేళ.. ఎవరోక వ్యక్తి ఈ మొక్కను అతడికి ఇచ్చాడట. ఆ సమయంలో పరిహార్‌కు మొక్క ప్రత్యేకత తెలియదు. ఇంటికి తీసుకెళ్లి ఆ మొక్కను నాటిన తర్వాత.. దానికి కాసిన కాయ రూ. 21 వేలకు అమ్ముడవటంతో పరిహార్‌కు దాని ప్రత్యేకత అర్ధమైంది. ఇక అప్పటినుంచి ఆ మామిడి మొక్కను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ చెట్టుకు కాసిన ఏడు మామిడి కాయల కోసం ఏకంగా నలుగురు సిబ్బంది, ఆరు కుక్కలను సెక్యూరిటీగా పెట్టాడు.!
Also Read:
కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?
పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!