సచిన్ తొలి పాట.. ‘త్రోబ్యాక్’ వీడియోను షేర్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న క్రికెట్ గాడ్.!

మైదానంలోకి దిగి సిక్సులు, ఫోర్లు కొట్టడమే కాదు.. పాటలు కూడా పాడటం తెలుసంటున్నాడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. సింగర్ సోనూ నిగమ్‌తో..

  • Updated On - 1:31 pm, Wed, 23 June 21
సచిన్ తొలి పాట.. 'త్రోబ్యాక్' వీడియోను షేర్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న క్రికెట్ గాడ్.!
Sachin

మైదానంలోకి దిగి సిక్సులు, ఫోర్లు కొట్టడమే కాదు.. పాటలు కూడా పాడటం తెలుసంటున్నాడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. సింగర్ సోనూ నిగమ్‌తో కలిసి పాడిన తన తొలి పాటకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సచిన్.. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘త్రోబ్యాక్’ మెమోరీస్ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

పాటను పాడేందుకు సింగర్స్‌ పడే కష్టం తెలిసి వచ్చిందని సచిన్ అన్నాడు. పాటలోని ప్రతి లిరిక్స్‌తో పాటు వాయిస్‌ Modulation’s చూసుకుంటూ పాడటమంటే అంత ఆషామాషీ కాదని చెప్పుకొచ్చాడు. ఇక సోనూ నిగమ్‌లాంటి గొప్ప సింగర్‌తో సాంగ్‌ పడటం మరింత సంతోషాన్ని ఇచ్చిందని సచిన్ అన్నాడు. కాగా, 2017లో తొలిసారి సచిన్, సోనూ నిగమ్‌తో కలిసి పాట పాడిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ రోజు అస్సలు నిద్రే పట్టదు…

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మ్యాచ్ జరిగే ముందు రోజు అస్సలు నిద్రపోలేకపోయేవాడినని చెప్పుకొచ్చాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.  ”నా 10-12 ఏళ్ల కెరీర్‌లో మ్యాచ్ ముందు రోజు అస్సలు నిద్రపోలేదు. మరుసటి రోజు జరిగే మ్యాచ్ గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవాడిని. దాదాపు దశాబ్దం తర్వాత నేను ప్రతీ మ్యాచ్‌కు ముందు చేసుకునే ప్రిపరేషన్ ఇదేనేమోనని గ్రహించాను. మ్యాచ్‌లో ఎలా ఆడతాను అనే దానిపై ఆందోళన చెందటం మానేశాను. మానసికంగా ఫుల్ ఫోకస్ పెట్టి ఆడేవాడినని సచిన్ తెలిపాడు.

 

View this post on Instagram

 

A post shared by Sachin Tendulkar (@sachintendulkar)

Also Read:

13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!

పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!