వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కి లండన్ కోర్టులో చుక్కెదురు… అయితే….?
ఇండియాకు తనను అప్పగించాలన్న ఉత్తర్వులను సవాలు చేస్తూ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దాఖలు చేసిన అప్పీలును లండన్ కోర్టు కొట్టివేసింది.
ఇండియాకు తనను అప్పగించాలన్న ఉత్తర్వులను సవాలు చేస్తూ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దాఖలు చేసిన అప్పీలును లండన్ కోర్టు కొట్టివేసింది. మోడీని ఇండియాకు అప్పగించాలని వెస్ట్ మినిష్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గత ఫిబ్రవరిలో ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈయన లండన్ హైకోర్టుకెక్కాడు. కానీ ఈ అప్పీలుకు ఆధారాలు లేవని ఈ కోర్టు దీన్ని తిరస్కరించింది. మేజిస్ట్రేట్ కోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడింది. కాకపోతే ఈయన మౌఖిక వాదన తాలూకు వాంగ్మూలాన్ని హైకోర్టు ఆలకించవలసి ఉంది. అది పెండింగులో ఉందని దాన్ని కూడా కోర్టు తిరస్కరించిన పక్షంలో ఇక బ్రిటన్ లో ఆయనకు న్యాయపరమైన మార్గాలన్నీ మూసుకుపోయినట్టేనని అంటున్నారు. కానీ …ఇండియాకు తన అప్పగింతను సవాలు చేస్తూ ఆయన యూరోపియన్ హ్యూమన్ రైట్స్ కోర్టును ఆశ్రయించే చాన్సు కూడా ఉంది. 2019 మార్చి 19 నుంచి మోడీ లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పంజాబ్ నేషజనల్ బ్యాంకును రూ. 13,500 కోట్ల మేర చీట్ చేసిన కేసులో ఈయనను తమకు అప్పగించాలని కోరుతూ ఇండియా నానా పాట్లు పడుతోంది. ఎప్పటికప్పుడు విదేశీ చట్టాలు ఈయనకు ప్రతిబంధకాలుగా ఉంటున్నా ‘గట్టెక్కుతున్నాడు’..
తాజాగా నీరవ్ మోడీ..ఆయన బంధువు మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాలకు చెందిన ఆస్తుల్లో 9,317.17 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు బదిలీ చేసింది. వీటిలో కొన్ని ఈ సంస్థ స్వాధీనం చేసుకున్నవో లేదా జప్తు చేసినవో ఉన్నాయి. తన ఆస్తులను అమ్మి తన రుణాలు తీర్చాలని విజయ్ మాల్యా లోగడ కోర్టును కోరిన సంగతి తెలిసిందే…
మరిన్ని ఇక్కడ చూడండి: IndiGo offer: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్
IndiGo offer: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్