AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IndiGo offer: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్

కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 29 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్‌స్టిట్యూట్‌ కలిసి అభివృద్ధి...

IndiGo offer: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్
Indigo Company
Ram Naramaneni
|

Updated on: Jun 23, 2021 | 6:37 PM

Share

కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 29 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్‌స్టిట్యూట్‌ కలిసి అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకాలతో పాటు స్పుత్నిక్‌ అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడానికి పలు దేశాలు ఆపర్లను ప్రకటించాయి. విదేశాల్లో వ్యాక్సిన్ వేసుకున్న వారికి బీర్లు ఫ్రీ అంటూ కొన్ని సంస్థలు ప్రకటించాయి. మరికొన్ని చోట్లు డిస్కౌంట్లు, ఫ్రీ గిఫ్ట్స్ వంటివి కూడా నడిచాయి. తాజాగా- ఈ లిస్ట్‌‌లో ఇండియా నుంచి మొదటిసారిగా ఓ విమానయాన సంస్థ చేరింది.

కరోనా టీకా తీసుకున్న ప్రయాణికుల కోసం దేశీయ విమానయాన సంస్థ ఇండిగో క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ట్రావెట్ టికెట్‌లో డిస్కౌంట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఛార్జీలో 10 శాతం మేర రాయితీ ఇస్తోంది. ఈ మేరకు ‘వ్యాక్సిఫేర్‌’ పేరుతో కొత్త ఆఫర్‌ను బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 18ఏళ్ల పైబడి వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్నవారు సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది.   ఆరోగ్య సేతు యాప్‌లో రికార్డయిన తమ వ్యాక్సిన్ స్టేటస్‌ను బోర్డింగ్ గేట్ దగ్గర చూపించి ప్రయాణ రాయితీని పొందవచ్చని సంస్థ తెలిపింది. టికెట్‌ బుక్‌ చేసుకున్న సమయానికి భారత్‌లో ఉండి రెండు డోసులు లేదా కనీసం ఒక్క డోసు తీసుకున్న వారు ఈ డిస్కౌంట్‌ పొందొచ్చు.  దేశంలో కోవిడ్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోందని, ఈ క్రమంలో ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపై ఉందని ఇండిగో ఎయిర్‌లైన్స్ చీఫ్ స్ట్రాటజీ అండ్ రెవెన్యూ అధికారి సంజయ కుమార్ వివరించారు.

ALso Read:  ఏపీలో కొత్తగా 4,684 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

చిరంజీవి ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!