AP Corona Cases: ఏపీలో కొత్తగా 4,684 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 80,712 పరీక్షలు నిర్వహించగా.. 4,684 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో...
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 80,712 పరీక్షలు నిర్వహించగా.. 4,684 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,62,036 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో కొవిడ్ కారణంగా 36 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 12,452కి చేరింది. కొత్తగా 7,324 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,98,380కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,13,61,014 శాంపిల్స్ ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
#COVIDUpdates: 23/06/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,59,141 పాజిటివ్ కేసు లకు గాను *17,95,485 మంది డిశ్చార్జ్ కాగా *12,452 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 51,204#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ktK5S5af2B
— ArogyaAndhra (@ArogyaAndhra) June 23, 2021
దేశంలో కరోనా కేసుల వివరాలు…
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. మొత్తం కేసులు 3 కోట్లు దాటాయి. కొత్తగా 50,848 మంది వైరస్ సోకినట్లు తేలింది. మహమ్మారి ధాటికి మరో 1358 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 30,028,709
- యాక్టివ్ కేసులు: 6,43,194
- కోలుకున్నవారు: 2,89,94,855
- మొత్తం మరణాలు: 3,90,660
దడ పుట్టిస్తున్న ‘డెల్టా ప్లస్’ వేరియంట్ కేసులు..
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న సమయంలో ‘డెల్టా ప్లస్’ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రకం వైరస్ ఇప్పటికే పలు రాష్ట్రాలకు పాకగా.. 40కి పైగా కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 21 ‘డెల్టా ప్లస్’ కేసులు వెలుగుచూశాయి.
Also Read: ‘పనిమనిషి ఉంటేనే ఇంట్లో ఉంటాను..’ భార్యా, కుమారుడిని ఇంట్లో పెట్టి తాళం వేసిన ప్రొఫెసర్